నా ఎస్టీలు అని గర్వంగా చెప్పుకునే నేత జగనన్న
ఎస్టీలకు విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందించిన ఘనత సీఎం జగన్ దే
మంత్రి వర్గంలో ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి గౌరవించిన జగన్
సంక్షేమం గురించి మాట్లాడటానికి చంద్రబాబుకు అర్హత లేదు
నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వి విజయసాయి రెడ్డి
కోవూరు : నా ఎస్టీలు అని గర్వంగా చెప్పుకునే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎస్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసి సమాజంలోని అసమానతలు రూపు మాపే లక్ష్యంతో ఆయన పరిపాలన సాగించారని రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వి విజయసాయి రెడ్డి అన్నారు. కోవూరులో గిరిజన గ్రామాల ప్రజలతో కోవూరు జాతియ రహదారి సమీపంలో శివాలయం ఎదురుగా ఉన్న మైదాన ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల ప్రజలకు విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి, సంక్షేమ పథకాలు చేయూతనిచ్చి గిరిజనుల్ని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గిరిజన విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో విదేశీ విద్య పేరుతో వారికి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మరో పదేళ్లు పొడిగించి ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేశారని అన్నారు. మంత్రి వర్గంలో పాముల పుష్ప శ్రీవాణి, రాజన్న దొరలకు చోటిచ్చి ఉప ముఖ్యమంత్రులుగా చేశారని, ఎస్టీ జనరల్ అయినప్పటికీ మహిలకు ప్రాధాన్యత ఇచ్చి స్రవంతిని నెల్లూరు మేయర్ గా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసేందుకు వైఎస్సార్సీపీ తరఫున నిండు మనస్సుతో మద్దతు తెలిపారని అన్నారు.
సంక్షేమం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
చంద్రబాబు ఆర్థిక విధానాలతో ఎస్టీలు నష్టపోయారని, గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాల బారిన పడి ప్రజలు చనిపోయినా పట్టించుకోలేదని, ఎస్సీ, ఎస్టీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రజలందరినీ బాధించాయని గుర్తుచేశారు. దళితులు, గిరిజనుల్ని చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకున్నాడని అన్నారు. సంక్షేమం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్న వాలంటీర్ వ్యవస్థ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి అవ్వా, తాతలకు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తీరని అన్యాయం చేశాడని అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తున్న వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నాడని అన్నారు.
ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబానికి కోవూరుతో విడదీలేని అనుబంధం
ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబంతో కోవూరు ప్రజలకు విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందని, ఆ కుటుంబం నుంచి ఏకంగా 8 సార్లు అసెంబ్లీకి పంపించిన ఘనత ఈ ప్రాంత ప్రజలదేనిని అన్నారు. ప్రతిపక్ష తేదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతికి అంతర్జాతీయంగా వ్యాపారాలు ఉన్నాయని ఇక్కడి ప్రజలను ఆమె పట్టించుకోరని అన్నారు. నిత్యం అందుబాటులో ఉండే ప్రసన్న కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా, ఎంపీగా విజయసాయి రెడ్డి అనే నన్ను గెలిపించాలని, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు.
కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష తెదేపా పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి దయతో ఆరు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా, ఆయన భార్య టీటీడీ బోర్డులో మెంబర్ గా పదవులు అనుభవించి, ఒక ముస్లిం మైనార్టీ సోదరుడుకి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని కోపంతో పార్టీని వీడి, వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని అన్నారు. ఈయనకు పేదలంటే పడదు. గిరిజనులు, దళితులు, ముస్లిం మైనార్టీలంటే పడదు. అటువంటి వ్యక్తి ఇప్పుడు తేదేపా పార్టీ నుంచి నెల్లూరు నుండి ఎంపీగా, ఆయన భార్య కోవూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగుతున్నారు. రాజకీయ నాయకుల కన్నా ప్రజలు తెలివైన వారని, ఎవరికి అవకాశం ఇవ్వాలో వారికి తెలుసని అన్నారు. ఇటీవల ఆయన ఓ సమావేశం నిర్వహించి తన ఇంటికి ఎవ్వరూ రావద్దని, ప్రతి మండలంలో ఓ కార్యాలయం పెడతానని, వారికి కలిసి పనిచేయించుకోవాలని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. అటువంటి వ్యక్తి ప్రజా సేవ ఏ విధంగా చేస్తాడని అన్నారు. డబ్బుతో ఏమైనా చేయొచ్చని ఆయన భావిస్తున్నాడని, అటువంటి వ్యక్తికి ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. తాను, విజయసాయి రెడ్డి పేద ప్రయోజనాలే ప్రాధాన్యత గా పనిచేస్తామని, ప్రజలకు తామెప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు.
నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన హయాంలో గిరిజన ప్రాంతాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని అన్నారు. నెల్లూరు మేయర్ స్థానం ఎస్టీ జనరల్ అయినప్పటికీ మహిళగా గౌరవించి మేయర్ పీఠం పై తనను కూర్చోబెట్టారని అన్నారు. గత చంద్రబాబు పాలనతో గిరిజన సంక్షేమం పూర్తిగా విస్మరించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసిలు శ్రీలత, సరోజమ్మ,జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ విజయలక్ష్మి, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ లో చేరిన పలువురు టీడీపీ నేతలు
కోవూరు మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు పమంచి వెంకటేశ్వర్లు అతని అనుచరులు మొత్తం 80 మంది విజయసాయిరెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.