ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ఎన్టీఆర్ జిల్లా : ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కలెక్టరేట్ నుంచి ఇప్పటికే జిల్లాస్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) పనిచేస్తోందని, ఈ కేంద్రం కార్యకలాపాలు సజావుగా సాగేందుకు వీలుగా కలెక్టరేట్లో నూతన ప్రాంగణాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. సోమవారం కలెక్టర్ డిల్లీరావు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ కేంద్రం నూతన ప్రాంగణాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సీ-విజిల్, కాల్సెంటర్, ఎన్నికల వ్యయ నిర్వహణ వ్యవస్థ (ఈఎస్ఎంఎస్), ఎంసీసీ, ఫిర్యాదుల పరిష్కారం, నివేదికల నిర్వహణ తదితర విభాగాలకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా నోడల్ అధికారులు, ఆర్వోలు, ఏఆర్వోలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ స్క్వాడ్స్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణ, స్వీప్ కార్యక్రమాలు తదితరాల మధ్య పటిష్ట సమన్వయ సాధనకు కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం కీలకంగా పనిచేస్తుందని కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో వి.శ్రీనివాసరావు, డిఆర్డిఏ పీడీ కె.శ్రీనివాసరావు, ఎంసీఎంసీ సభ్యులు వెలగా జోషి, కలెక్టరేట్ ఏవో సీహెచ్ నాగలక్ష్మి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.