టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీల నుండి 50 మంది వైసీపీలో చేరిక
వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 18వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో ప్రతిపక్ష పార్టీలకు భారీ షాక్ తగిలింది. రూరల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్ష పార్టీల నుండి 50 మంది నాయకులు, కార్యకర్తలు నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీలో చేరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేందుకు, నెల్లూరు అభివృద్ధికి సహకారం అందించేదుకు స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చిన టిడిపి, బిజెపి, జనసేన, వామపక్షాల నాయకులు కార్యకర్తలను రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర రెడ్డి మనస్ఫూర్తిగా అభినందించి వైసిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. స్వచ్ఛందంగా పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవంతోపాటు తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, వారికి భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బంది వచ్చిన తాను అన్నివిధాల అండగా ఉంటానని రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 18వ డివిజన్ కార్పొరేటర్ టీ. అశోక్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, జిల్లా వైస్సార్సీపీ ప్రధానకార్యదర్శి వేలూరు శివసునీల్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ దారా వంశీ, పుట్టా విజయకుమార్ రెడ్డి, మారంరెడ్డి కుమార్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎద్దల వెంకటేశ్వర్లరెడ్డి, అంకయ్య, ఖాదర్, శీనయ్య, కార్తీక్, మురళి, రియాజ్, మల్లి, వరదయ్య, వెంకటేశ్వర్లు, పెద్దమ్మ, గౌరీ, చాన్, తదితరులతోపాటు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.