విజయవాడ బ్యూరో ప్రతినిధి : రంజాన్ మాసం మానవుల జీవితాలను ఉత్తమంగా తీర్చిదిద్దుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్ధి షేక్ ఆసిఫ్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని 39వ డివిజన్లోని మదీనా మసీదు ప్రాంగణంలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో షేక్ ఆసిఫ్‌గారు ఇతర ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్‌ను స్వీకరించారు. అనంతరం మసీదు బయట ఆయనను కలిసిన మీడియాతో ఆసిఫ్ మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదే కాకుండా ఎన్నో విధాలుగా సమాజాన్ని జాగృతం చేసే అంశాలను వివరిస్తుందన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు పేదల ఆకలిదప్పికలు తెలుసుకోవటానికి ఉపవాసదీక్షలు ఆచరించాలని రంజాన్ మాసం బోధిస్తుందన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా ఉండటమే కాకుండా వారి అభివృద్ధికి అనేక రకాల కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. దివంగత మహనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేసి ముస్లింల భవితకు బాటలు వేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింలకు రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తున్నారని వివరించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ముస్లింలపై ఉందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర, జిల్లా వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ షేక్ గౌస్‌మొహిద్దీన్, కమిటీ అధ్యక్షులు షేక్ మౌలాలి, కార్యదర్శి బాబు, సభ్యులు జిలానీ, యుసఫ్, నాయకులు హాయత్, బషీర్, సుభాన్‌ఖాన్, జీఎంసీ అల్తాఫ్, గౌస్, ఇక్బాల్, అజీజ్, ఖాశీం, మీర్‌హుస్సేన్, ఇమామ్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.