వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ బ్యూరో ప్రతినిధి : ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం నియోజకవర్గంలో స్థానిక 29వ డివిజన్ మధుర నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కొంగితల లక్ష్మిపతి, తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్దిని వివరిస్తూ కరపత్రం అందచేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్ధించారు. ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా 29 వ డివిజన్ లో పర్యటించడం జరిగిందన్నారు. అందరితో కలిసి పర్యటించామన్నారు. ఆర్ యు బి కొంత ఆలస్యం అయిందని, కొద్ది రోజుల్లో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. డ్రైనేజీ సమస్యలు కొంత చెప్పారని, వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మీటింగ్ లకు స్పందన కరువు అయిందని, ప్రజలు జగన్ సభలకు వేలాదిగా వస్తున్నారన్నారు. బోండా ఉమా ఎమ్మెల్యే గా ఉన్నపుడు ప్రజలకు ఏమి చేశారో సమాధానం చెప్పాలన్నారు. బోండా భవిష్యత్తు రాజకీయ సన్యాసం తీసుకోవడమే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.