గుంటూరు పార్లమెంట్ ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు : స్వచ్ఛ రాజకీయాల కోసం యువత రాజకీయాల్లోకి రావాలని, రానున్న ఎన్నికల్లో గుంటూరు జిల్లా పరిధిలో ఎంపి అభ్యర్థితో పాటు 7 శాసనసభ సెగ్మెంట్ల అభ్యర్థుల గెలుపు కోసం తెలుగుయువత సైనికుల మాదిరిగా శ్రమించి చారిత్రక విజయం దిశగా అడుగులు వేయాలని గుంటూరు పార్లమెంట్ ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పిలుపునిచ్చారు. గుంటూరు పార్లమెంట్ టిడిపి జనసేన బిజెపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారితో గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో “మీట్ & గ్రీట్” పేరుతో జిల్లా స్థాయిలో తెలుగుయువత ఆత్మీయ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ ఎంపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు,గుంటూరు పశ్చిమ టిడిపి జనసేన బిజెపి అభ్యర్థి గళ్ళా (పిడుగురాళ్ల) మాధవి గారు,కోవెలమూడి రవీంద్ర (నాని) గారు ముఖ్య అతిధులుగా హాజరయ్యి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధానాల పైన తెలుగుయువత కు దిశానిర్దేశం చేశారు. అనంతరం మాజి ఎంపి జయదేవ్ గల్లా జన్మదినం సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఏర్పాటు చేసిన కేకును గుంటూరు పార్లమెంట్ టిడిపి జనసేన బిజెపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కట్ చేసి జయదేవ్ గల్లా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని ‘యువతలో నేటి రాజకీయమంటే నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ యువత రాజకీయాల్లోకి రావాలి.’ అని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిచి సైరన్ సౌండ్ వచ్చే వాహనాల్లో ప్రయాణించడానికి రాలేదని, తన వంతు సాయంగా యువతకు, ఇతరులకు తోడ్పాటును అందించేందుకు వచ్చామని చెప్పారు. యువత నిరుత్సాహపడకుండా సాంకేతికతతో పోటీపడుతూ ముందుకు సాగాలన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తాను కలిసి రాబోయే పదేళ్లకు ఉపయోగపడేలా ప్రజలకు, యువతకు ఉపయోగపడేలా పలు ప్రణాళికలు రచిస్తున్నామని, యువత సహకరిస్తే మరెన్నో అద్భుతాలు సృష్టించగలమని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలో మూడు యూనివర్సిటీలు తెచ్చిన ఘనత చంద్రబాబు గారిదే అని అన్నారు. అయితే మరో 40 యూనివర్సిటీలు రాజధానికి రావడానికి సిద్ధంగా ఉండగా, జగన్ రద్దు చేయడంతో ఆగిపోయిన విషయం చాలామందికి తెలియదని వివరించారు. గుంటూరు పశ్చిమ నియోజక వర్గం టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అకుంఠిత దీక్ష దక్షలతో అందరం శ్రమించి నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని మీ ముందున్న సాధారణ మాధవిని గెలిపొంచి ఒక్క అవకాశం ఇస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కృష్టి చేస్తానని కష్టపడ్డ ప్రతిఒక్కరికి గుర్తింపు గౌరవాన్ని ఇస్తూ అంకిత భావంతో ముందుకు సాగుతానని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడిన పార్టీ తెలుగుదేశం ఒక్కటేనని ఎస్సి ఎస్టి బిసి మైనారిటీల అభ్యున్నతి సంక్షేమం కోసం కృషి చేసిన నేత ఆనాడు ఎన్టీఆర్ అయితే నేడు చంద్రబాబు ఒక్కడేనన్నారు. గుంటూరు పశ్చిమ టిడిపి సీనియర్ నాయకుడు కోవెలమూడి రవీంద్ర నాని మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో గుంటూరు పశ్చిమలో గళ్ళా మాధవి ని సొంత తోబుట్టువు వలె ఆదరించి ఒక బిసి మహిళను అఖండ మెజారిటీతో గెలిపించి భారీ విజయాన్ని అందించాలని అందుకు తన వైపు నుండి ఎటువంటి సహాయ సహకారానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఎంతోమంది యువతను కేసులతో మానసిక వేధింపులతో ఇబ్బందులు పెట్టారని, అయినా తెలుగు యువత ఎక్కడా వెనకడుగు వేయకుండా ఇప్పటివరకు వెన్నుచూపని పోరాటం చేశామని భవిష్యత్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు ఆడకా శ్రీనివాస్ రావు,జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా బాబు,జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షులు కొల్లిమర్ల రాము,గుత్తికొండ కిరణ్ యాదవ్,కొండపి శేఖర్,అధికార ప్రతినిదులు సింగు గోపి,తప్పెట్ల ప్రదీప్ చంద్,షేక్ షుకూర్, కార్యనిర్వాహక కార్యదర్సులు షేక్ రషీద్,పఠాన్ అథావుల్లా ఖాన్, కార్యదర్సులు వేమా విజయ కాంత్,మాచవరపు దాసు,గుంటూరు పశ్చిమ తెలుగు యువత ప్రధాన కార్యదర్సులు పూసల శ్రీనివాస్, షేక్ ఇమ్రాన్, ఉపాధ్యక్షులు పప్పుల రాంబాబు , కార్యనిర్వాహక కార్యదర్శి కోలా మల్లికార్జున రావు, గుంటూరు తూర్పు తెలుగుయువత అధ్యక్షులు షేక్ అఫ్రోజ్, ఉపాధ్యక్షులు ఉప్పుటూరి వెంకటేష్, కార్యనిర్వాహక కార్యదర్సులు శ్రీపతి రాంబాబు,కొమ్మన నరేష్, వేముల కిరీటి, ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుయువత అధికార ప్రతినిది ఉగ్గిరాల మార్కండేయులు,గుంటూరు రురల్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి గాలి శ్రీనివాస్ గౌడ్, ఫిరంగిపురం మండల తెలుగుయువత అధ్యక్షులు గుండిగ బాలాజోసప్,48వ డివిజన్ టిడిపి అధ్యక్షులు చెరుకుపల్లి నాగరాజు, తెలుగుయువత నాయకులు షేక్ రఫీ,నంబూరు జోషి ప్రకాష్, కట్టెపోగు నవీన్,అశోక్ ,చిక్కాల శివరామకృష్ణ,బుల్లా కుమార్ బాబు,కళ్యాణ్,శొంఠినేని అనిల్,తిమ్మిశెట్టి గణేష్, పొందూరి బాలాజీ,పొత్తూరి వెంకటేశ్వరావు,ఉగ్గిరాల పూర్ణ ,జరుగుల బాలు మహీంద్రా,బవిరిశెట్టి కృష్ణ బాబు, లతో పాటు పెద్దసంఖ్యలో యువత విద్యార్థులు పాల్గున్నారు.