విజయవాడ పశ్చిమ : ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా శనివారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని కొత్తపేట షేక్ రాజు సోహెబ్ ప్రసూతి వైద్యశాల (మినీ జనరల్) లో సి హెచ్ సి పరిధిలో ఆసుపత్రి సూపరింటెండెంట్, స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్ కత్తపేట లో క్షయ నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టరు ఏ శివాజీ రావు ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఇందులో ముఖ్యంగా క్షయ వ్యాధికి దాని చీకిత్స, పరీక్షలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమావేశానికి వచ్చిన ప్రజలకు వివరించారు. క్షయ వ్యాధిని అంతమొందించాడానికి భారతదేశం 2025 కల్లా క్షయ రహిత భారత దేశం అనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నదని వైద్యులు ప్రకటించారు. క్షయ వ్యాధి పీడితులకు పూర్తికాలం చికిత్సతో పాటు పౌష్టికాహరం తప్పనిసరిగా తీసుకోవాలని తెలియజేశారు. దగ్గు, జ్వరం,
వంటి లక్షణాలు ఉంటే దగ్గరలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో (ఉచితంగా) తెమడ పరీక్షలు చేయించుకోవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, క్షయవ్యాధి
విభాగంలోని సిబ్బంది, భవ్య ప్రోజెక్టు, జీత్ ప్రోజెక్టు
సిబ్బంది పాల్గొన్నారు.