24 వ తేదీ వరకు కొనసాగనున్న ప్రదర్శన *ప్రారంభించిన కేఎల్ యూనివర్సిటీ సెక్రటరీ కోనేరు కాంచన లత
విజయవాడ బ్యూరో ప్రతినిధి : జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీ.ఐ ఫెస్టివల్ శుక్రవారం విజయవాడలో ప్రారంభమైంది. స్థానిక సిద్ధార్థ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి జి.ఐ కోఆర్డినేటర్ భారత్ మహోత్సవ నెంబర్ గణేష్ ఆధ్వర్యంలో కే.ల్ యూనివర్సిటీ వారు ఏర్పాటు చేసిన జీ.ఐ ఫెస్టివల్ ను కేఎల్ యూనివర్సిటీ సెక్రటరీ కోనేరు కాంచన లత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సారిగా విజయవాడలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీ.ఐ ఫెస్టివల్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10 నగరాల్లో జరిగిన జి.ఐ ట్యాగ్ కలిగివున్న నాణ్యత గుర్తింపు కలిగిన వస్తువులు మాత్రమే ఈ ప్రదర్శనలో ఉంచడం జరుగుతుందన్నారు. విజయవాడలో మార్చి 22, 23, 24 వ తేదీల్లో జి.ఐ ట్యాగ్ ఉన్న వస్తువులు మాత్రమే 70కి పైగా స్టాల్స్ లో దేశం నలుమూలల నుండి ఈ ప్రదర్శనలు ఉంచుతున్నామని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం భారత్ జి.ఐ మహోత్సవం సాంస్కృతి, సంప్రదాయాలు, కళలు, తో సంబరాలు జరుపుకునేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలియజేశారు అన్నారు అందులో భాగంగా ఫ్యాషన్ పోటీలు భారతదేశయ ఆధారితమైన జి.ఐ ట్యాగ్ వస్తువులతో నిర్వహించాలని ఆదేశాలని, మిస్టర్ , మిస్సెస్, కిడ్స్, మిస్ ఫ్యాషన్ పోటీలు నిర్వహించేందుకు మన భారతదేశానికి చెందిన దుబాయ్ ఫ్యాషన్ టెక్నాలజీ లో ఉన్న మిస్సెస్ అనిసా బేగం పాల్గొంటున్నారని చెప్పారు. అలేఖ్య మిసెస్స్ అమరావతి , సామాజికవేత్త హిమబిందు, స్వాతి.కె (ప్రాచీన కళా కేంద్ర స్టేట్ అడ్మినిస్ట్రేషన్), పాల్గొని వారి కార్యక్రమాల వివరాలలో భాగంగా 23వ తేదీ కొన్ని నృత్యాలు, కళాబృందలతో నృత్యాలు, స్టోరీ రైటింగ్స్ పోటీలు, ఆర్టిస్టులకు ప్రాచీన కళల చిత్రాలపై పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కల్చరల్ నైట్స్, దేశీయ ఫ్యాషన్ షో ని జాగ్నాస సీఈవో గాయత్రి, శ్రీదేవి ఈ కార్యక్రమ కన్వీనర్ కే రాఘవరావు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్గనైజర్స్ ఆపిల్ హాస్పిటల్స్ రాజశేఖర్, వెల్నెస్ కోచ్ అనిత పాల్గొన్నారు. అన్ని స్టాల్స్ లో ఎక్కడా దొరకని నాణ్యతతో కూడిన వస్తువులు మాత్రమే దొరుకుతాయన్నారు. తద్వారా ఎంతోమందికి జీవనోపాధి కలగడంతో పాటు మనకు ఆరోగ్యవంతమైన నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు.