విజయవాడ బ్యూరో ప్రతినిధి : విజయవాడ లో అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ( ఏఐసీసీ) ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోర్ కమిటీ కాన్ఫరెన్స్ జరిగింది. ముఖ్య అతిథులుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ , ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, సెంట్రల్ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఏఐసిసి సభ్యులు, చర్చ్ ఫాదర్ లు పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రములో. 175 నియోజకవర్గాల శాసనసభ్యులకు, 25 పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేక ప్రార్థనలు చేసి మరల రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు చేయాలని ప్రార్థించారు.