జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా ఇంచార్జ్ భవ్య నరసింహమూర్తి
విజయవాడ బ్యూరో ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి కార్యాలయం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో మంగళవారం జిల్లా స్థాయి సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా ఇంచార్జ్ భవ్య నరసింహమూర్తి పాల్గొన్నారు. జోనల్ కోఆర్డినేటర్లు జిల్లాల అధికారిక సోషల్ మీడియా పేజీలను ఇకపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే విశాఖపట్నం సోషల్ మీడియా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హృదయ్ ని సంప్రదించాలని సూచించారు. ఈనెల 25 నాటికి అన్ని జిల్లాల కోఆర్డినేటర్లు నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియా కోఆర్డినేటర్ల నియామకం జరపాలని తెలిపారు. జోన్లు వారీగా జిల్లాల కోఆర్డినేటర్లతో సమావేశానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్ల సమస్యలను తెలుసుకొని తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో స్టేట్ కోఆర్డినేటర్ , కో-చైర్పర్సన్ లక్ష్మణ్ , స్టేట్ కోఆర్డినేటర్స్ బాలు మరియు లక్ష్మణ్, స్టేట్ కో-చైర్పర్సన్ పి.సి.హెచ్. అజాద్, వార్ రూమ్ కో-చైర్పర్సన్ సోమశేఖర్, బాలు, లక్ష్మణ్ పాల్గోన్నారు. అనంతపురం నుండి ఇచ్చాపురం వరకు జరిగిన పలు భారీ బహిరంగ సభలకు అద్భుతమైన పోస్టర్లను లోగోలను తయారుచేసి పెట్టిన కంటెంట్ క్రియేటివ్ సభ్యుల పనితీరును కొనియాడారు.