ఈ నెల 18 నుంచి ఆర్జిత సేవల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు
మార్చి 21న వివిధ రకాల ఆర్జిత సేవల టికెట్ల కోటా విడుదల
ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల
ఈ నెల 25న రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల
ఈ నెల 23న శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనుంది. ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవల లక్కీ డిప్ వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు మరిన్ని ఆర్జిత సేవల టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు జ్యేష్ఠాభిషేకం ఉత్సవ వికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. తిరుమలలో జ్యేష్ఠాభిషేకం జూన్ 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లు, శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. అదే రోజున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం వృద్ధులు, దివ్యాంగుల కోసం దర్శన టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు.