ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి
విజయవాడ నుంచి ప్రత్యేక ప్రతినిధి : ఐఅండ్ పి ఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి ని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) నాయకులు ఉప్పల్ లక్ష్మణ్, ఎన్ యు జె ఐ మాజీ అధ్యక్షులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, జాప్ టీఏజే ఫౌండర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలివెల సత్యనారాయణ బుధవారం కలిశారు. ఆయన తో ఇంటి స్థలాల గురించి, జర్నలిస్టుల అంశాల గురించి చర్చించగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కూడా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేయవచ్చని సమాచార శాఖ కమిషనర్ విజయకుమారరెడ్డి తెలిపారు. ఇళ్ల స్థలాల స్కీం క్యాబినెట్ ఆమోదము పొందినందున దాని స్కీం కొనసాగింపు ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా ఈ ప్రక్రియకు అవరోధం ఉండదని, ప్రతి జిల్లాలో కూడా మొదటగా ప్రభుత్వ భూములను ఉన్నాయా, లేదా అని పరిశీలిస్తున్నారని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములు గుర్తించామని, ప్రభుత్వ భూములు జర్నలిస్టులకు ఉపయోగకరంగా లేని పక్షంలో ఉపయోగకరమైన చోట ప్రైవేటు భూములు కొనుగోలు చేసి అర్హత గల ప్రతి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. బుధవారం విజయవాడలో కమీషనర్ కార్యాలయం లో ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి ని ఉప్పల లక్ష్మణ్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వెలవెల సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి కలిసి చర్చించారు. వీలైనంత త్వరగా అన్ని జిల్లాల్లో ఇంటి స్థలాలు ఇవ్వడం జరుగుతుందని కమీషనర్ తెలిపారు. జర్నలిస్ట్ హెల్త్ స్కీం ను కూడా జర్నలిస్ట్ లు ఉపయోగించుకోవాలని చెప్పారు. అక్రిడేషన్లలో అన్యాయం జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. సుమారు 13,000 మంది ఇళ్లస్థలాల అప్లికేషన్లు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయగా అందులో సుమారు 6000 మంది మాత్రమే అర్హత పొంది ఉన్నారన్నారు. అలాగే లేబర్ కమిషనర్ శేషగిరి బాబును కలిసి పలు విషయాలు చర్చించారు.