వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి
గుంటూరు, ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా సిఎం జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకూ ప్రజల నుంచి పెరుగుతున్న మద్దతుతో ప్రతి పక్షాలు వణికిపోతున్నాయాని రాజ్యసభ సభ్యలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలలో జరిగిన సిద్దం సభలకు ప్రజల నుండి పెద్ద ఎత్తన మద్దతు లభించిందని, ఒకదానికి మించి మరోకటి విజయ వంతమయ్యాయని అన్నారు. భీమిలిలో సిద్ధం సభకు 3 లక్షలు, ఏలూరు దెందులయ సభకు 6 లక్షలు, అనంతపురం రాప్తాడు సభకు 10 లక్షలు, బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం జరిగిన అఖరి సభకు 15 లక్షల మంది కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేశారని తెలిపారు. ఈ సభల ద్వారా మళ్లీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, వైనాట్ 175 లక్ష్య ఛేదన మార్గం సుగమం అయిందని విజయసాయిరెడ్డి అన్నారు.