అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందచేస్తారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణలంక కనకదుర్గ వారధి వద్దకు చేరుకుంటారు. అక్కడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రారంభోత్సవం, విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేసిన అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.