‘చంద్రబాబు మహాదోపిడీని చూసి హైకోర్టు సైతం విస్తుపోయింది’
ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్లీ రుజువు
ఒరిజినల్ ఐఎంజీతో సంబంధం లేకుండా దోపిడీ చేశారు
ఇంత పెద్ద స్కెచ్ వేసింది చంద్రబాబే
తెలంగాణ హైకోర్టు తీర్పును ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామ కృష్ణా రెడ్డి ధ్వజం
గుంటూరు : ప్రపంచంలోనే ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్లీ రుజువైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అందుకు 20 ఏళ్ల క్రిత చంద్రబాబు చేసిన మహా దోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోవడాన్ని సజ్జల ఉదహరించారు. ‘20 ఏళ్ల క్రితం చంద్రబాబు చేసిన మహాదోపిడీని చూసి తెలంగాణ హైకోర్టు సైతం విస్తుపోయింది. ఒక క్లాసికల్ దోపిడీ చేయగల వ్యక్తి చంద్రబాబు అని మళ్ళీ రుజువైంది. తెలంగాణ తీర్పును ఎల్లోమీడియా ఎందుకు రాయలేదు?, నాలుగు రోజుల్లోనే కథంతా నడిపారు. ఒరిజినల్ ఐఎంజీతో సంబంధం లేకుండా దోపిడీ చేశారు. 850 ఎకరాల స్థలాలు ఇచ్చేశారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో ఐదు వేల గజాల స్థలం ఇవ్వాలని గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. కనీసం క్యాబినెట్ ఆమోదం కూడా లేకుండా జీవోలు ఇచ్చి దోపిడీ చేశారు. లక్ష కోట్ల రూపాయల ప్రాపర్టీ కైవసానికి 20 సంవత్సరాల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేశారు. అపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే నాలుగు రోజుల్లోనే పని కానిచ్చారు. వైఎస్ఆర్ ఔదార్యంతో వదిలేయటం వలనే చంద్రబాబు బయట పడ్డారు. లేకపోతే అప్పట్లోనే చంద్రబాబు జైలు ఊచలు లెక్కపెట్టేవారు. అప్పటికీ, ఇప్పటికీ కనీసం చంద్రబాబులో మార్పు రాలేదు. అమరావతిలో కూడా 17 వందల ఎకరాలను బోగస్ కంపెనీలకు కట్టబెట్టారు. ఐఎంజీ స్కామ్ లాగే సేమ్ అమరావతిలో కూడా చేశారు. చంద్రబాబు, తన మనుషులంతా ఆ ప్రైమ్ ఏరియాలోనే భూములు ఉండేలా ప్లాన్ చేశారు. దాని అభివృద్ధి మాత్రం ప్రభుత్వ నిధులతో చేపట్టాలని చూశారు.
రైతుల నుండి భూములను తీసుకుని మొత్తంగా మింగేయాలని చూశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అలాగే తప్పుడు పనులు చేసి జైలు పాలయ్యారు. 2015లోనే స్కిల్ స్కాం మొదలెట్టారు. అంతర్జాతీయ స్కామ్ స్టర్ చంద్రబాబు. అప్పట్లో వైఎస్సార్ ఐఎంజీ స్కామ్‌ని బయటపెడితే, ఇప్పుడు చంద్రబాబు అమరావతి స్కామ్‌ని సీఎం జగన్ బయటపెట్టారు. రింగ్ రోడ్డు నుండి అనేక స్కామ్ లను బయటకు తీశారు. జగన్ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేసేవాడు. 2024లో అధికారం ఇస్తే ఇక రాష్ట్రమే కనపడదు. అధికారం కోసం ఎవరూ ఊహించని హామీలు ఇస్తారు. అధికారంలో వచ్చాక ఎవరికీ అర్థం కాని దోపిడీ చేస్తారు. చంద్రబాబు ఢిల్లీలో చేయని ప్రయత్నం లేదు. టీడీపీ అంపశయ్య మీద ఉంది. ఆఖరి క్షణంలో చివరి ప్రయత్నంగా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఈసారి బీజేపీతోపాటు కాంగ్రెస్ ను కూడా అంతర్గతంగా పొత్తు పెట్టుకున్నాడు. చంద్రబాబు పొత్తులను చూస్తుంటే మాకు ప్రజా బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మని అధ్యక్షరాలిని చేశారు. ఆమె వెనుక నడిపించేవారు వేరే వారున్నారు. పొత్తులనేవి చంద్రబాబు బలహీనతకు నిదర్శనం. అదే సమయంలో మా బలం కూడా తెలుస్తోంది. అన్ని పార్టీల కలిసినా అధికారంలోకి రాలేవు. ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీలకు భావసారూప్యత ఏమీ లేదని సజ్జల విమర్శించారు.