విజయవాడ : ఏపీలో జైభారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడింది. ఎపి యునైటెడ్ ఫ్రంట్ గా దీనికి నామకరణం చేసారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సమావేశమైన 8 పార్టీల నేతలు సాధారణ ఎన్నికల్లో పోటీపై వ్యూహం రూపొందిస్తున్నారు. దీనికి కన్వీనర్ గా జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కూడమిలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమార్, ఐ.ఎ.ఎస్, డాక్టర్ రఘు, కోఆర్డినేటర్ , ఆల్ తెలుగు ప్రజాపార్టీ, శివభాగ్యారావు, ఐ.ఆర్.ఎస్, జాతీయ సమ సమాజ్ పార్టీ రామయ్య యాదవ్, ప్రజా రిపబ్లికన్ పార్టీ దాసరి చెన్నకేశవులు, స్వతంత్ర జనతా పార్టీ ఆనంద్ కుమార్, పోతిన వెంకట రామారావు, జైభారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నవతరం పార్టీ రాజు సుబ్రహ్మణ్యం తదితర పార్టీలు ఏపీ యునైటెడ్ ఫ్రెంట్ లో ఉన్నాయి.