గుంటూరు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెన్షన్ల పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. అమరావతి రాజధాని గ్రామాల్లో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ పెంచుతూ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటి వరకు ఇస్తున్న రూ.2,500 ను రెట్టింపు చేస్తూ రూ.5వేలకు పెంచింది. ఈ మేరకు అధికారులు జీవో విడుదల చేశారు. గతంలో గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పెన్షన్ పెంచుతానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు ఇచ్చే మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం వారికి పెన్షన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది