తూర్పులో చిరంజీవి ఓట్లు 8,05,836
అదృష్టం లేక నాలుగు సీట్లకే పరిమితం
బలమైన అభ్యర్థులు పోటీ
రాజకీయాల్లోనే కాదు ఏ రంగంలో రాణించాలన్నా అదృష్టం కూడా కలిసి రావాలి. అలా అదృష్టం కలిసి రాక అనేకమంది రాజకీయ నాయకులు అనుకున్న స్థాయికి చేరుకోలేరు. మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీకి విశేష స్పందన వచ్చింది. కాని చివర్లో ఫలితాలు భిన్నంగా వచ్చాయి. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చిరంజీవికి కరుడుగట్టిన అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులకు తగ్గట్టుగానే ఓట్లు కూడా వచ్చాయి. కానీ సీట్లు మాత్రం ఆ స్థాయిలో రాలేదు.
2009 ఎన్నికలు చాలామంది చిరంజీవి అభిమానులను నిరుత్సాహ పరిచిన ఫలితాలు గురించి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల గుర్తు రైలు ఇంజిన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో 8,05,836 ఓట్లు వచ్చాయి. కాని సీట్లు మాత్రం నాలుగుకే పరిమితమయ్యాయి. ప్రజారాజ్యం కంటే కాంగ్రెస్ పార్టీకి 90 వేల ఓట్లు అధికంగా వచ్చాయి దీంతో ఏకంగా 11 సీట్లు కైవసం చేసుకుంది. ప్రజారాజ్యం కంటే తెలుగుదేశం పార్టీకి సుమారు లక్ష ఓట్లు తక్కువ వచ్చాయి. అయినప్పటికీ ఆ పార్టీ కూడా నాలుగు సీట్లు దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 8,96,019 ఓట్లు రాగా టిడిపికి 7,06,325 ఓట్లు వచ్చాయి.
అమలాపురం పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి 3,48,227 ఓట్లు రాగా పిఆర్పి కి 3,36,533 ఓట్లు వచ్చాయి.ఇక టిడిపికి 2,42,604 ఓట్లు వచ్చాయి.ఈ ఏడు నియోజకవర్గాల్లో కొత్తపేట నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీలో చేసిన బండారు సత్యానందరావు ఒక్కరే విజయం సాధించారు. అలాగే టిడిపి నుంచి మండపేట అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు గెలుపొందారు. మిగిలిన ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఓటమి చెందినప్పటికీ ప్రజారాజ్యం పార్టీ అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం, మండపేట, రామచంద్రపురం నియోజవర్గంలో రెండో స్థానంలో నిలిచింది.
ఇక కాకినాడ పార్లమెంట్ పరిశీలిస్తే ప్రజారాజ్యం పార్టీకి 2,92,673 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 3,20,222 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 2,72,148 ఓట్లు వచ్చాయి. ఈ పార్లమెంట్ నుంచి ముగ్గురు ప్రజాపారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపొందారు. పిఠాపురం నుంచి వంగా గీత, పెద్దాపురం పంతం గాంధీమోహన్, కాకినాడ రూరల్ కురసాల కన్నబాబులు గెలుపొందారు.ఇక్కడ పి ఆర్ పి ఎంపి అభ్యర్థి చలమలశెట్టి సునీల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 34,044 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.
ఇక రాజమండ్రి పార్లమెంటు పరిధిలో జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరం సిటీ, రూరల్ రాజనగరం, అనపర్తి నియోజకవర్గాలతో పాటు రంపచోడవరం నియోజవర్గంలో ప్రజారాజ్యం పార్టీకి 1,76,,630 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి 2,27,570 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 1,91,573 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక్క అనపర్తి నియోజకవర్గం 70,623 ఓట్లు వచ్చాయి.
“జిల్లాలో ప్రజారాజ్యం పార్టీకి వచ్చిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి*
అమలాపురం.. 51,649
రాజోలు.. 46,450
పి గన్నవరం.. 41,359
ముమ్మిడివరం 31,400
కొత్తపేట.. 62,453
మండపేట… 50,664
రామచంద్రపురం 52,558
కాకినాడ సిటీ.. 35,327
కాకినాడ రూరల్.. 53,494
పిఠాపురం.. 44,606
పెద్దాపురం.. 46,211
జగ్గంపేట.. 50,395
ప్రత్తిపాడు..30,544
తుని….30,079
రాజమండ్రి రూరల్..43,070
రాజమండ్రి సిటీ…39,384
రాజానగరం..38,656
అనపర్తి..34,749
రంపచోడవరం…20,771