శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
మన్యుసుక్త హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న సీఎం
శారదా పీఠంలో సీఎం జగన్కు సాదర స్వాగతం
విశాఖపట్నం : శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజ్యశ్యామల అమ్మవారి యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. శ్రీ శారద స్వరూప రాజ్ శ్యామల అమ్మ వారి ఉత్సవ విగ్రహాలను సీఎం దర్శించుకుని అమ్మవారి దీక్ష పీఠం వద్ద పూజలో పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని, వన దుర్గ అమ్మవారిని శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామిని సీఎం జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. శారదాపీఠంలో ఉత్తరాధికారి స్వాత్మానందం సరస్వతి, పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిలను సీఎం జగన్ మోహన్ రెడ్డి కలిశారు. శారదాపీఠం చేరుకున్న సీఎం జగన్మోహన్రెడ్డికి మంత్రులు బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, వెస్ట్ ఇంచార్జ్ ఆడారి ఆనంద్ కుమార్ స్వాగతం పలికారు.