అమరావతి : కేంద్ర ఎంఎస్ఎంఇ శాఖ కార్యదర్శి ఎస్సిఎల్ దాస్ మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రంలో ఎంఎస్ఎంఇ రంగానికి సంబంధించి అమలు చేస్తున్న పలు ప్రాజెక్టులు తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత తదితరులు పాల్గొన్నారు.