అమరావతి : రాష్ట్ర సచివాలయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా గత సమావేశ యాక్షన్ టేకెన్ రిపోర్ట్,డిశంబరు 2023 బ్యాంకింగ్ కు ఇండికేటర్స్, 2023-24 వార్షిక ఋణ ప్రణాళిక సాధించిన ప్రగతి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రాయోజిత పధకాలు, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, డిజిటల్ జిల్లాలు,కేంద్ర ప్రభుత్వ , ఆర్బిఐ ఆన్ గోయింగ్ ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా,ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్,రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఎపి ఇన్చార్జి రాజేష్ కె.మహానా, నాబార్డు సిజియం ఎంఆర్ గోపాల్,యుబిఐ జియం మరియు ఎస్ఎల్బిసి కన్వీనర్ ఎం.రవీంద్ర బాబు,ఆ బ్యాంకు జియం గుణనాద్ గమి, ఆర్థిక శాఖ కార్యదర్శి కెవి.సత్య నారాయణ,చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమీషనర్ శేఖర్ బాబు,గృహ నిర్మాణ సంస్థ ఎండి శ్రీధర్, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.