విజయవాడ : విజయవాడ వన్ టౌన్ లో ఐడిబిఐ నాల్గవ శాఖను శుక్రవారం ఐడిబిఐ చీఫ్ జనరల్ మేనేజర్ శరత్ కామత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ జనరల్ మేనేజర్ శరత్ కామత్, జోనల్ మేనేజర్ వి. వాసుదేవన్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా శరత్ కామత్, వాసుదేవన్ మీడియాతో మాట్లాడుతూ మంచి ప్రజాదరణతో ఐడిబిఐ బ్యాంకు నడుస్తుందని చెప్పారు. విజయవాడలో పోరంకి వద్ద, స్టెల్లా కాలేజ్ వద్ద, గవర్నర్ పేటలోనూ తమకు బ్రాంచ్ లు ఉన్నాయని చెప్పారు . వ్యాపార వాణిజ్య వర్గాలు ఎక్కువగా ఉండే వన్ టౌన్ ప్రాంతంలో ఈ నాలుగో బ్రాంచ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని వ్యాపార వాణిజ్య వర్గాల ను వారు కోరారు. ఐడిబిఐ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 1970 కి పైగా శాఖలు ఉన్నాయని, 2.78 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు వేల కోట్ల నెట్ ప్రాఫిట్ లక్ష్యంగా బ్యాంకు పురోగమిస్తుందని, డిసెంబర్ వరకు నాలుగు వేల కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ ను సాధించడం జరిగిందని వారు వివరించారు. కొత్తగా 300 రోజుల డిపాజిట్ల పథకాన్ని ప్రారంభించామని దీనిలో 7.05% వడ్డీ ఇస్తామని, సీనియర్ సిటిజన్లకు 7.55% వడ్డీని అందజేస్తామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐడిబిఐ రీజినల్ మేనేజర్ సాయి కృష్ణ, నూతన వన్ టౌన్ బ్రాంచ్ మేనేజర్ మాదాసు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా గోల్డ్ మెడల్ సంస్థ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ జైన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మర్చంట్స్ ప్రెసిడెంట్ బచ్చు ప్రసాద్, బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ వడ్డి సురేంద్రబాబు, ఆపరేషనల్ మేనేజర్ తుమ్మపూడి శిరీష, బ్యాంకు ఉద్యోగులు, పలువురు ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.