అమరావతి : విశాఖపట్నం లో జనవరి 18 నుండి 30 వరకు జరిగిన 14వ అఖిల భారత పోలీసు కమాండో పోటీలను విజయవంతంగా నిర్వహించిన పోలీస్ అధికారులను డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. దేశంలో ఇప్పటి వరకు, వివిధ రాష్ట్రాలలో మొత్తం 13 అఖిల భారత పోలీసు కమాండో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల ద్వారా సామర్థ్యం, విశ్వాస స్థాయిలు, శారీరక మరియు మానసిక ప్రమాణాలు, జట్టుకృషి మొదలైవి పెంపొందించబడతాయి. ప్రతిష్టాత్మకమైన 14వ (అఖిల భారత పోలీసు కమాండో పోటీల)AIPCC–2023-24ను ఆంధ్ర ప్రదేశ్ పోలీసు శాఖ తరుపున ఈ నెల 18.01.2024 నుండి 30.01.2024 వరకు విశాఖపట్నం లోని గ్రేహౌండ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం లో అఖిల భారత పోలీసు క్రీడా కంట్రోల్ బోర్డ్, న్యూ ఢిల్లీ వారి చే నియమించబడిన న్యాయ నిర్ణేతల బృందం, వివిధ రాష్ట్ర పోలీసు మరియు సాయుధ బలగాలు (పరామిలిటరీ) పర్యవేక్షణ లో నిర్వహించడం జరిగింది.
ఈ పోటీలలో వివిధ ట్రోఫీలు, బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో టీం, రణ-నీతి, చక్రవ్యూహ్-1 రూరల్ & చక్రవ్యూహ్-2 అర్బన్, బ్లాక్ హాక్ ఫైరింగ్, చీతా రన్, బెస్ట్ టీం ఇన్ కాన్ఫిడెన్స్ కోర్సు, కమాండో కంపిటషన్ హార్డ్ లైనర్ (బ్రోంజ్), కమాండో కంపిటషన్ రన్నర్-అప్ (సిల్వర్), కమాండో కంపిటషన్ విన్నర్ (గోల్డ్) వంటి మొత్తం 10 ట్రోఫీల కోసం 300 మండి తో కూడిన వివిధ రాష్ట్రాలు, కేంద్ర దళాలకు చెందిన 23 జట్లు పోటీ పడి తమ అత్యున్నత నైపుణ్యాలను ప్రదర్శించాయి.
ఏపి గ్రేహౌండ్స్ జట్టు 10 ట్రోఫీలలో 05 ట్రోఫీలు, బెస్ట్ స్టేట్ పోలీస్ కమాండో టీం (జయలలిత, Ex-CM of TN ట్రోఫీ ), చక్రవ్యూహం 1 రూరల్, బెస్ట్ బ్లాక్ హాక్ ఫైరింగ్, టీం ఇన్ కాన్ఫిడెన్స్ కోర్సు గెలుచుకోవటం జరిగింది, తద్వారా, గ్రేహౌండ్స్ జట్టు ఓవర్ఆల్ విజేత గా నిలవడం తో కొమండో పోటీలలో స్వర్ణం సాధించి మొదటి స్థానం లో నిలిచింది. రన్-నీతి ట్రోఫీ బిఎస్ఎఫ్ కు, చక్రవ్యూహం 2 అర్బన్ మహారాష్ట్ర టీం, చీతా రన్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ శ్రీ బిజేంద్ర, కమాండో కంపిటషన్ హార్డ్ లైనర్ (బ్రోంజ్)/మూడవ స్థానం రాజస్తాన్, కమాండో కంపిటషన్ రన్నర్-అప్ (సిల్వర్)/రెండవ స్థానం లో మహారాష్ట్ర విజేతలుగా నిలిచారు.
అఖిల భారత పోలీసు కమాండో పోటీల్లో అగ్రస్థానం లో నిలిచిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసు కమాండో టీంలను ఈ రోజు పోలీసు ప్రధాన కార్యాలయం లో డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి గారు అభినందించారు .ఈ కార్యక్రమంలో గ్రేహౌండ్స్ చీఫ్ శ్రీ R.K.మీనా, ఐపిఎస్, ADGP, Ops. ఆర్గనైజింగ్ సెక్రెటరీ, వారి ఆధ్వర్యంలో జరిగాయి.