ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా
పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎం.డి.జాని పాషా
వెలగపూడి : 2019వ సంవత్సరంలో గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన 7వేల మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులకు 500మందికంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల పూర్తి స్థాయి పాలనా బాధ్యతలు డి.డి.ఒ అధికారాలు కల్పిస్తూ ఇటీవల జనవరి 31వ తేదిన రాష్ట్ర మంత్రి మండలి దస్త్రాన్ని ఆమోదించిన అనంతరం ఆర్ధిక శాఖ నుంచి అన్నీ అనుమతులు పొందిన అనంతరం గురువారం పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి.రాజశేఖర్ జి.ఒ నెంబర్ 11 పేరిట ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బృందం పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారిని కలిసి ఏడువేల మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారు తనని కలిసిన పంచాయతీ కార్యదర్శులను ప్రత్యేకంగా అభినందిస్తూ గ్రామ పంచాయతీలలో నివసిస్తున్న గ్రామీణ జనాభాకు అత్యంత పారదర్శకంగా అత్యున్నత సేవలు అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పంచాయతీ కార్యదర్శుల విభాగం కన్వీనర్ బి.రోజా ప్రకాష్,రాష్ట్ర సమన్వయ కర్త ఎం.రమేష్ బాబు,పంచాయతీ కార్యదర్శుల విభాగం సభ్యులు కె.శ్రీనివాస్,వి.రాజ రాజేశ్వరి,యన్.వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.