తొలిసారి పార్లమెంట్ అభ్యర్థిగా బిసిలకు దక్కిన అవకాశం
బీసీల ద్రోహి లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్లో పరిధిలోని బీసీల ఓట్లు ఎలా అడుగుతాడు
నరసరావుపేట ను బీసీలకు ఇవ్వటం ఇష్టంలేకే లావు వైసీపీని వదిలి వెళ్ళిపోయారు
14వ తేదీన జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి : మంత్రి అంబటి పిలుపు
సత్తెనపల్లి : చారిత్రాత్మకమైన నరసరావుపేట పార్లమెంటు స్థానం లో తొలిసారిగా బడుగులకు అవకాశం వచ్చిందని, బలమైన కేడర్ ఉన్న వైసిపి బడుగు, బలహీనవర్గాల శ్రేణులు అనిల్ కుమార్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. 14న నరసారావు పేట లో జరగనున్న వైఎస్ఆర్సిపి బహిరంగ సభ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి మాట్లాడుతూ
నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి బడుగు, బలహీన వర్గాలకు అవకాశ మిద్దామంటే అది నచ్చని ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయలు ఏకంగా వైఎస్సార్సీప్పీని వదిలి వెళ్లిపో యారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా కీలక పదవులివ్వాలన్న ఆశయంతో పనిచేస్తున్న సీఎం జగన్ ఈ సారి నరసరావుపేట లోక్ సభ స్థానాన్ని బీసీలకు కేటాయించారు. లావు శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయాలని సీఎం జగన్ సూచించారు. కానీ నరసరావుపేట స్థానాన్ని బీసీలకు కేటాయించడం ఇష్టం లేక లావు వైఎస్సార్సీపీనే వదిలే శారు. ఇలాంటి వ్యక్తి బీసీ ద్రోహి కాదా? పార్లమెంటు పరిధిలో బీసీల ఓట్లు లావు అలా అడుగుతాడో చూద్దాం అన్నారు. బిజెపి నేతలతో కలిసి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు తీవ్ర గందరగోళంలో ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. జనసేన- బీజేపీతో పొత్తులో ఉందో, టీడీపీతో ఉందో తెలియని పరిస్థితి ఆ పార్టీ నాయకుల్లో ఉందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి సభ ఏర్పాటు చేసుకోలేక అయోమయంలో ఉన్నారని చురకలాంటించారు.
విద్యావంతుడు, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ కుమార్ ను నరసరావుపేట నుంచి వైఎస్సార్సీపీ తర ఫున అఖండ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈ నెల 14న నరసరావుపేటలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్ఆర్సిపి బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను , స్టిక్కర్లను మంత్రి అంబతిబీ,నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు , ముప్పాళ్ళ మండల కన్వీనర్ నక్క శ్రీనివాసరావు , మర్రి సుబ్బారెడ్డి, బాసు లింగారెడ్డి ,తేలుకుట్ల చంద్రమౌళి, లోక మాధవ్, గడ్డం బుల్లోడు, అయ్యప్ప తదితరులు ఉన్నారు