పీవీ మేధస్సును కూడా పరి రక్షించ వలసి ఉంది : వైవీ అనురాధ
విశాఖపట్నం : భారత జాతి గర్వించ దగ్గ ఆదర్శ మూర్తి పీవీ నరసింహా రావు చరిత్ర నేటి తరానికి మార్గ దర్శకం అని వర్ధమాన నాయకులు ద్రోణంరాజు శ్రీ వాత్సవ తెలిపారు. అది నేటి రాజకీయాల్లో రాణించడం కష్టం గా ఉన్న నేటి కాలంలో ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం దిగ్విజయం గా పూర్తి చేసిన ఘనత పీవీ కే చెల్లిందన్నారు. ఈ దేశంలో మొట్ట మొదట గా పీవీ విగ్రహాన్ని విశాఖ లోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బహు భాషా కోవిదులు, ఆర్ధిక సంస్కరణ వేత్త, పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు కు భారత దేశ పురస్కారం భారత రత్న పురస్కారం లభించిన సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆదివారం విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయం లో జరిగిన ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రముఖ న్యాయవాది కెవి రామమూర్తి మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమే. అయితే కొందరు ఎక్కువ సమానం అన్న నానుడి పీవీ నరసింహారావు కు వర్తిస్తుందని అన్నారు. విశ్రాంత ఐఏఎస్ వై వి అనురాధ మాట్లాడుతూ పీవీ నరసింహా రావు ఒక రంగానికి అపరిమితం చేయరాదన్నారు. రాజకీయం, ఆర్ధికం, సామాజిక, భాషా సాహిత్య రంగాల్లో నైపుణ్యం కల్గిన విద్వత్ సంపన్నులు అన్నారు. పీవీ మేధస్సును కూడా పరి రక్షించ వలసి ఉందన్నారు. అయితే వారి శక్తి సామర్థ్యాలను సమయానుకూలంగా ప్రదర్శించారాన్నారు. వేయి పడగలు. లాంటి మహా గ్రంధాన్ని తెలుగేతర ప్రాంతాలకు అందించారన్నారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యులు సుహాసిని ఆనంద్, ఏయు విశ్రాంత అధ్యాపకులు పి ఎస్ అవధాని, వుడా మాజీ చైర్మన్ రవి, బత్తుల శ్రీనివాస్, వైజాగ్ భ్రాహ్మిన్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు టిఎస్ఆర్ ప్రసాద్, విప్రోత్సవం కన్వీనర్ పి వి నారాయణ, సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ అహ్వానితులు కే. నరసింహమూర్తి, న్యాయవాది ఆకెళ్ళ రమణమూర్తి, శాయిరామ్, భాగవతుల శంకర్ నీలు, వడ్డాది ఉదయకుమార్ తదితరులు పాల్గొన్నారు.