మహిళా ఉద్యోగులకు రెండు సంవత్సరాల పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలి
ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్
విజయవాడ : కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కూడా రెండు సంవత్సరాల పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదర్ కోరారు. సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ బారతదేశంలో మహిళా ఉద్యోగినులు ఎక్కడ పని చేస్తున్నాసరే వారికి ఉండే ఇబ్బందులు ఎప్పుడూ ఒక్కటిగానే ఉంటాయి. కాని కేంద్ర ప్రభుత్వం లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు చైల్డుకేర్ లీవ్ లు రెండు సంవత్సరాలు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఆరునెలలు మాత్రమే చైల్డుకేర్ లీవులు ఇవ్వడం దుర్మార్గమని, చాలా అన్యాయమన్నారు. కేంద్రంలో పని చేసే మహిళా ఉద్యోగుతో సమానంగా రాష్ట్రంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లు చైల్డుకేర్ లీవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
మా బకాయిలు మాకు చెల్లించాలి : మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రదేశాలలో కనీస వసతులు ఏర్పాటు చేయాలని, కుటుంబ అవసరాల కోసం దాచుకున్నా డబ్బులు కూడా చెల్లించరా.? అని ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం .? అని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా జీతంతో పాటు రావాల్సిన డి ఏ లు, సరెండర్ లీవులు పిఆర్సి, పదవీ విరమణ బకాయిలు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మహిళా విభాగం స్టేట్ చైర్ పర్సన్ పారే లక్ష్మి, ప్రధాన కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. గతంలో ఏ ప్రభుత్వానికి సహకరించని విధంగా ఈ ప్రభుత్వానికి ఉద్యోగులు ప్రత్యేకంగా కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి కష్టపడ్డారన్నారు. తుఫ్ఫాన్లు, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాలని మా జీతాల నుండి కొంత మొత్తం ప్రభుత్వానికి చెల్లించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకే దక్కుతుందని చెప్పారు. గత అయిదేళ్లుగా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయవంతంగా ప్రజలకు చేర్చిన ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటికైనా రూ. 6,700 కోట్ల బకాయిలు , డీఏ & పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. మేమేమీ బోనస్లు అడగడం లేదు. మా బకాయిలు చెల్లించాలని అడుగుతున్నామన్నారు. 24గంటలు కష్టపడే పోలీసులకు కూడా రెండు సంవత్సరాలుగా కనీసం సరెండర్ లీవులు కూడా చెల్లించక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్రితమే బకాయిలు అన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి స్వయంగా కలుగజేసుకుని తక్షణమే బకాయిలు చెల్లించాలన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగుల హెల్త్ స్కీం కే జబ్బు చేసిందని, ఇక ఉద్యోగులకు సరైన వైద్యం అందేది ఎక్కడ? అని అన్నారు.
అందరం ఐక్యంగా కలసి పనిచేద్దాం : ఏపిజేఏసి అమరావతి మహిళా విభాగం రాష్ట్రకార్యవర్గ సమావేశం శనివారం విజయవాడ రెవిన్యూభవన్ లో ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటికి అనుసందానంగా పనిచేస్తున్న ఏపిజేఏసి అమరావతి మహిళా విభాగం చైర్ పర్సన్ పారే లక్ష్మి అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో మహిళా విభాగం స్టేట్ చైర్ పర్సన్ పారేలక్ష్మి , స్టేట్ జెనరల్ సెక్రటరీ పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు అన్ని రంగాలలో విజయవంతంగా పనిచేస్తున్నారని, అలాగే ప్రభుత్వ విభాగాల్లో మహిళా ఉద్యోగులు 50 శాతం వరకు పనిచేసే పరిస్దితులు ఉన్నా సరే మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రధేశాలలో కనీసం టాయిలెట్సు లాంటి కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్దితులు చాలా చోట్ల ఉన్నాయన్నారు. అన్నిచోట్లా టాయిలెట్సు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయాలి : స్వయంగా రాష్ట్ర మహిళ కమిషన్ ద్వారా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగినులు పై వస్తున్న అని రకాల వేధింపులు అరికట్టాలంటే, ఐసీసీ (ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ) కమిటీలు ఏర్పాటు చేయాలని, మహిళా ఉద్యోగులు కొరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేకంగా టాయిలెట్స్ , చంటి బిడ్డలను సంరక్షించుకునేందుకు “చైల్డ్ క్రచెస్” ఏర్పాటు చేయాలని మూడు సంవత్సరాలుగా ప్రభుత్వానికి చెప్తున్నప్పటికి ఎలాంటి పురోగతి లేకపోవడం చాలా బాధాకరమని, గ్రామ, మండల స్థాయిలోనే ఎక్కువ ఉద్యోగినులు పనిచేస్తారని,అక్కడ కనీసం టాయిలెట్స్ లేనందున మహిళా ఉద్యోగినులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. జిల్లా కమిటిలద్వారా పూర్తి స్దాయిలో సేకరించి మహిళా ఉద్యోగులు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా అందరం ఐక్యంగా కలసి పనిచేద్దామని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి ఏక్షణంలో ఎలాంటి పిలుపు నిచ్చినా సరే 26 జిల్లాలు, క్యేపిటల్ సిటి యూనిట్ మహిళావిభాగాలు నాయకత్వం ఏపిజేఏసి అమరావతి వెన్నంటే ఉండి పనిచేస్తామని తెలిపారు. మహిళా ఉద్యగులందరికి అందుబాటులో ఉండేందుకు త్వరలో డివిజన్ స్దాయిలో కూడా మహిళావిభాగం కమిటిలు ఏర్పాటు చేసేలా జిల్లా మహిళా కమిటిలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏపిజేఏసి అమరావతి స్టేట్ అసోషియేట్ చైర్ మెన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధాకారి వి.వి.మురళి కృష్ట నాయుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రమేష్ కుమార్, మహిళావిభాగం అసోషియేట్ చైర్ పర్సన్ సైకం శివకూమారిరెడ్డి, కోశాధికారి గంటా పావని, డా. వి.యస్ సాయి లక్ష్మి, టి.వి.భవాని, డి.రత్న కుమారి, ఐ .విద్య తోపాటు కేపిటల్ జేఎసి చైర్మన్ ఆర్.దుర్గా ప్రసాద్ , ప్రధానకార్యదర్శి మందపాటి శంకరరావు, ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటి నాయకులు కే.చంద్రశేఖర్, బి.కిశోర్, డి.ఈశ్వర్, వి.ఆర్లయ్యా, నాగినేని నారాయణరావు, గరికపాటి బ్రహ్మయ్య, అల్లం సురేష్ తో పాటు 26 జిల్లాలు, క్యాపిటల్ సిటి యూనిట్ చైర్ పర్సన్లు, ప్రధానకార్యదర్శులతోపాటు అధికసంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.