అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవహరించానన్న స్పీకర్
అనేక ముఖ్యమైన బిల్లులు సభ ఆమోదం
విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనకు తాను బాధితుడిగా మారా
స్పీకర్ ఛాంబర్ వద్దకు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు
స్పీకర్ తమ్మినేని వద్దకు వెళ్లి నినాదాలు చేసిన టీడీపీ నేతలు
టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీరియస్
టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్ తమ్మినేని
వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిసారి నిష్పక్షపాతంగా వ్యవహరించానని, విపక్ష సభ్యులకు కూడా తాను సమాన అవకాశాలు కల్పించానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. తాను సభాపతిగా వ్యవహరించిన సమయంలో అనేక ముఖ్యమైన బిల్లులు సభ ఆమోదం పొందాయని ఆయన ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చానని, సభలో జవాబుదారీగా వ్యవహరించానని స్పీకర్ పేర్కొన్నారు. సభ గౌరవ మర్యాదలు పరిరక్షించేలా ప్రతి సభ్యుడూ నడుచుకోవాలని సూచించారు. విధుల నిర్వహణలో ప్రతిపక్ష సభ్యులు తనను ఇబ్బందికి గురిచేశారని సీతారాం అన్నారు. విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనకు తాను బాధితుడిగా మారానని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు తమ ప్రవర్తనతో శాసనసభ స్థాయిని తగ్గించారని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల విమర్శలను తాను ఓపికగా భరించానని, వారి ప్రవర్తన తనను భాదించిందని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 3 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాలు గురువారం నిరవధికంగా వాయిదా పడిన నేపథ్యంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. శ్రీకాకుళం నుంచి శాసనసభ స్పీకర్గా పనిచేసిన నాలుగవ వ్యక్తిగా తనకు అదృష్టం దక్కిందని గుర్తుచేసుకున్నారు. కాగా ఏపీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట సెషన్లో 9 కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయి. గురువారంతో సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి.
మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చాం
అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చాం. హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేదు. నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయి. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచిపనైనా జరిగిందా?.
అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే మేం చేసింది తక్కువే.
మాది సంక్షేమ ప్రభుత్వం : ఎమ్మెల్సీ రవీంద్రబాబు
ప్రతీ సంక్షేమ పథకం ప్రజల మేలు కోసమే అమలు చేశాం
మా ప్రభుత్వానికి పబ్లిసిటీ ముఖ్యం కాదు. ప్రజలకి మేలు జరగడం ముఖ్యం. రాష్ట్రానికి కోవిడ్ సమయంలో రావాల్సిన ఆదాయం రాలేదు రెండేళ్ల కోవిడ్ సమయంలో రెండు లక్షల కోట్ల రూపాయిల ఆదాయం తగ్గిపోయింది
గడిచిన నాలుగన్నరేళ్ల పాలనలో 4.60 లక్షల కోట్లు ప్రజలకి నేరుగా అందించాం
అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజల ఖాతాలలోకి నిధులు జమ చేశాం. మా ప్రభుత్వం వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలకి అధిక ప్రాధాన్యతనిచ్చింది
ప్రతీజిల్లాకి ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాం
మన రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు లేకే ఉక్రెయిన్ లాంటి సుదూర దేశాలకి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
ఆర్ధిక ఇబ్బందులు ఉన్న్పటికీ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగలేదన్నారు.
కాగా శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ముందు వ్యక్తిగతంగా వంశీకృష్ణ యాదవ్ హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి చైర్మన్ ముందు హాజరయ్యారు.
మూడు బిల్లులకి శాసనమండలి ఆమోదం
ఆర్జేయూకేటీ విశ్వ విద్యాలయ సవరణ బిల్లు, ఏపీ అసైన్ భూముల సవరణ బిల్లు,
ప్రభుత్వ సేవలలో నియామకాల క్రమబద్దీకరణ, సిబ్బంది తీరు, వేతనవ్యవస్ధ హేతుబద్దీకరణ సవరణ బిల్లులకి శాసన మండలి ఆమోదం తెలిపింది.
శాసన మండలి పదినిమిషాలు వాయిదా
పెద్దల సభలోన టీడీపీ సభ్యుల తీరు మారలేదు. చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో నిరసన, నినాదాలు చేశారు.
చైర్మన్ వారించినా టీడీపీ ఎమ్మెల్సీలు సభకు అంతరాయం కలిగించవద్దని చైర్మన్ విజ్ణప్తి
పట్టించుకోకుండా టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలు
చేయడంతో శాసన మండలి వాయిదా పడింది. అంతకు ముందు జాబ్ క్యాలెండర్, దిశ, మద్యపాన నిషేదంపై ఎమ్మెల్సీల వాయిదా తీర్మానం ఇచ్చారు. టీడీపీ సభ్యుల వాయిదా తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్ తిరస్కరించారు. సభలో టీడీపీ సభ్యుల నినాదాలు, సభా కార్యక్రమాలకు అడ్డుకునే యత్నం చేయడంతో కాసేపు శాసనసభ వాయిదా పడింది.