విజయవాడ : జర్నలిస్టుల హౌసింగ్ సైట్స్ ను త్వరిత గతిన ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటానని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జర్నలిస్ట్ జెఏసి నాయకులు జర్నలిస్ట్ హౌసింగ్ సైట్స్ విషయమై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లి రావుని కలిశారు. ఆక్రిడేషన్ మంజూరులో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా జర్నలిస్టుల ఇండ్లస్థలాల వెరిఫీకేషన్ లో బాగ వెనకబడి ఉన్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.ఎన్టీఆర్ జిల్లాలో రూరల్ మండలాల్లో జర్నలిస్టుల జాబితాలు వచ్చినప్పటికిని ఆయా తహసీల్దార్ లు మూలన పడేశారని కలెక్టర్ దృష్టికి తీసికెళ్ళారు. విజయవాడ మండల అర్బన్ కార్యలయాలకు కనీసం లిస్ట్ కూడ చేరలేదని తక్షణమే విజయవాడ మండల కార్యాలయాలైన పశ్చిమ, తూర్పు, సెంట్రల్ తహశీల్దార్ కార్యాలయంలకు లిస్ట్ పంపి వెరిఫికేషన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ తక్షణమే జాయింట్ కలెక్టర్, సమాచార శాఖ అధికారులతో ,రెవిన్యూ అధికారులతో కాన్ఫరెన్స్ పెట్టి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అలాగే జర్నలిస్టుల కు సంబంధించి భూమి కొనుగోలుపై కూడ సత్వరమే నిర్ణయం తీసుకుంటామని హమి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిఎంపిఎ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, వార్త మండలి నమ్మయ్య,ఆంధ్రప్రదేశ్ చిన్న పత్రికల సంపాదకుల అధ్యక్షుడు కూర్మ ప్రసాద్ బాబు, జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎ.వి.వి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.