జనసేన నగర అధికార ప్రతినిధి గయాసుద్దీన్
అంగరంగ వైభవంగా ఐజా రథయాత్ర
విజయవాడ : రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొంది జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడం తద్యమని జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాసుద్దీన్ (ఐజా) అన్నారు. బుధవారం ఐజా రథ యాత్ర పేరుతో పాల ఫ్యాక్టరీ వద్ద నుంచి వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు వెంటరాగా గయాసుద్దీన్ పంజా సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా గయాసుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబుల ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పారు . కోస్తా ఆంధ్రాలో విజయవాడ పశ్చిమ మాత్రమే మైనార్టీలకు కంచుకోట వంటిదని, అందుకే విజయవాడ పశ్చిమ సీటును మైనార్టీలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. పశ్చిమ లో జనసేన పార్టీకి ఉన్న ఏకైక మైనార్టీ నాయకుడిని తానేనని ఐజా చెప్పారు. గత ఎన్నికల నుంచి పార్టీ కోసం తాను ఎంతో కష్టపడుతున్నానని, అనేక కార్యక్రమాలను, ప్రజాసేవ కార్యక్రమాలను చేసినట్లు ఆయన వివరించారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ సోదరులంతా జనసేన, టిడిపిలకి మద్దతు ప్రకటిస్తున్నారని ఆయన చెప్పారు. వైసిపి ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేదని లేదని విమర్శించారు. అందుకే రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు మైనార్టీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పశ్చిమ టిక్కెట్ ను పొత్తులో భాగంగా తెలుగుదేశం, జనసేన పార్టీలో ఎవరికిచ్చినా తాము పార్టీ నిర్ణయాన్ని శిరసా వహిస్తామని అన్నారు. జనసేన పార్టీ జెండా మోస్తున్న సిన్సియర్ నాయకుడు అయిన తాను జనసేన తరపున తనకు పశ్చిమ టిక్కెట్ కేటాయించాలని ఆశించడంలో తప్పు లేదని గయాసుద్దీన్ స్పష్టం చేశారు. నేటి తన ప్రజా యాత్రలో పెద్ద సంఖ్యలో యువత మహిళలు పాల్గొనడం పట్ల ఆయన కృతజ్ఞతలు చెప్పారు. గత నెలలో ఐజా ప్రజా యాత్ర పేరిట భవానిపురంలో చేసిన పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. నేటి రెండవ యాత్రకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ,జనసేన అభిమానులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగిందని చెప్పారు. కాగా మార్గ మధ్యంలో సర్దార్ మరుపిళ్ళ చిట్టి విగ్రహానికి ఐజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పాదయాత్రలో జనసేన, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ఐజా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.