గయాసుద్దీన్ ను సత్కరించిన హజ్రత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గా ప్రాంత పెద్దలు
విజయవాడ : రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన పార్టీ తరపున షేక్ గయాసుద్దీన్ కు ఇవ్వాలని భవానిపురంలోని హజ్రత్ సయ్యద్ గాలిబ్ షాహిద్ దర్గా ప్రాంత ముస్లిం పెద్దలు జనసేన తెలుగుదేశం నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం దర్గా ప్రాంతంలోని ముస్లిం పెద్దల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాసుద్దీన్ (ఐజా)దర్గాలో బాబా వారికి చాదర్ ను సమర్పించిన అనంతరం వారు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో ముస్లింల జనసంఖ్య ఎక్కువగా ఉందని, కావున జనసేన నాయకులు గయాసుద్దీన్ కు పశ్చిమ టిక్కెట్టును ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు చెప్పారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గయాసుద్దీన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు అఖండ విజయం సాధించడం ఖాయమని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని చెప్పారు. ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం, అలాగే పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని యువతకు సరైన విద్యా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు షేక్ ఖాజా, మొహమ్మద్ అల్తాఫ్ , రఖిబ్ ,హైదర్ అలీ, ఆఫ్రోజ్, పలువురు ముస్లిం మత పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.