హెచ్ సి జీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు వి.ఎస్. యన్.రావు
మానవత్వం పరిమళించే ద పవర్ ఆఫ్ గుడ్ విషెస్
విజయవాడ : అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి తనకు సంబంధం లేని వ్యక్తులు ప్రేమతో మీరు బాగుండాలని చెబితే వారు పొందే ఆనందం అంతా ఇంతా కాదు..ఆ మాటలు అనారోగ్యాo తో ఉన్న వ్యక్తికి మనోధైర్యాన్ని నింపి అతనికున్న వ్యాధిని త్వరగా నయం అయ్యేటట్టు చేస్తుంది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని హెచ్ సి జీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్య్వర్యంలో క్యాన్సర్ తో బాధపడుతున్న వారి కోసం ‘డ్ పవర్ ఆఫ్ గుడ్ విషెస్’ అనే కార్యక్రమాన్ని విజయవాడ బందర్ రోడ్ లోని పి.వి.పి మాల్ లో ఆదివారం క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా రెడ్ ఎఫ్ ఎం ఆర్ జే లు ఇస్మార్ట్ స్వీటీ, అన్య మాల్‌కు వచ్చిన వారి దగ్గర నుండి గుడ్ విషెస్ తీసుకొని ఎఫ్ఎం రేడియో లో ప్లే చేశారు. ఈ కార్యక్రమం క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి మనోధైర్యం ఇస్తుందని, క్యాన్సర్ పై అవగాహన పెంచుతుందని హెచ్ సి జీ క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు వి.ఎస్. యన్.రావు అన్నారు. హెచ్ సి జి క్యాన్సర్ హాస్పిటల్ మరొక స్పెషల్ డాక్టర్ కే. రంగనాథ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 2022 వ సంవత్సరంలో 14 లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడించాయన్నారు. ఆ కారణంగా 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారన్నారు. క్యాన్సర్ పై అవగాహన కల్పించడం ద్వారా మరణాల రేటును గణనీయంగా తగ్గించడం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ,ముఖ్య, అతిథులుగా చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ , విజయవాడ హెచ్ సి జీ క్యాన్సర్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తెర్లి యువ కిశోర్ , విజయవాడ, జోనల్ హెడ్ నార్త్ కర్ణాటక అండ్ ఆంధ్ర ప్రదేశ్ కె.రవి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని రెడ్ ఎఫ్ ఏం స్టేషన్ హెడ్ క్రాంతికుమార్, ప్రోగ్రామింగ్ హెడ్ ఆదిల్ భాష పర్యవేక్షించారు