ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఆయన కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్సగ్రేషియా ప్రకటించాలి
స్పౌస్ కి గ్రూప్-2 స్థాయి ఉద్యోగం కల్పించాలి
రెవిన్యూ ఉద్యోగులకు మానసిక ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ఏపీ ఆర్ఎస్ఏ ప్రధాన కార్యదర్శి గా కంచెర్లపల్లి రమేష్ కుమార్ ఎన్నిక
విజయవాడ : అత్యంత కిరాతకంగా జరిగిన తహసీల్దార్ రమణయ్య హత్య రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులకు భయాందోళన కలిగిస్తుందని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడ రెవిన్యూ భవనములో ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశము రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముందు హత్యకు గురైన తహసిల్దార్ రమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి బొప్పరాజు తో పాటు రెవెన్యూ ఉద్యోగులు ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల పై దాడి చేయాలనే ఆలోచనే రాకుండా చట్టాలను ఇంకా కఠినతరం చేయాలన్నారు. అత్యంత కిరాతకంగా జరిగిన తహసీల్దారు రమణయ్య హత్య రాష్ట్రంలోని రెవిన్యూ ఉద్యోగులకు భయాందోళ కలిగిస్తుంది. విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్ రమణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని రమణయ్య భార్యకు గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాన్ని కల్పించాలన్నారు. తాసిల్దార్ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని బొప్పరాజు కోరారు.
రాష్ట్ర ఎక్జిక్యూటివ్ కమిటీ రమణయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేసి, హత్యకు కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా హత్యకు కారకులైన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని,తహశీల్దార్ రమణయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వ భూములు కాపాడటం, భూ సంబందిత అంశాల పరిష్కారంలో నిత్యం తలమునకలయ్య రెవిన్యూ ఉద్యోగులకు మానసిక ధైర్యం, నమ్మకం కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వానిదే. భూ వివాదాలు ఉన్న మండలాల తహశీల్దార్లు కు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ కల్పించాలని, విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగి పైన విధి ఆటంకములు, దాడులు కు సంబంధించి, దోషులపైన చర్యలు తీసుకొనుటకు కఠినమైన చట్టం తీసుకురావాలని, రెవిన్యూ ఉద్యోగులు అందరూ ఇతర జిల్లాలకు వెళ్లి ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ఈ తరుణంలో ఇలాంటి దారుణమైన సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చెపట్టబోతుందో తక్షణమే చెప్పాలి. ప్రస్తుత చట్టాలలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని తప్పించుకుపోయే విధానాలను ఆసరాగా చేసుకుని నిందితులు భరితేగిస్తున్నారని అందువలన నిందితులను విధి నిర్వహణలోఉన్న ఉద్యోగుల పై దాడి చేయాలనే ఆలోచనే రాకుండా చట్టాలను ఇంకా కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. 2024 సాధారాణ ఎన్నికల నిర్వహణకు సరిపడా నిధులు మంజూరు చేయాలని 2019 లో నిర్వహించిన సాధారణ ఎన్నికల ఖర్చులు ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికీ కొంత భాగము చెల్లింపులు జరగలేదు. గత ఎన్నికలకు, ఎన్నికల అధికారులు మరియు వారి దిగువ స్థాయి సిబ్బంది చేసిన ఎన్నికల ఖర్చులకు చెల్లించాల్సిన బకాయిలు గత నాలుగు సంవత్సరములుగా చెల్లిస్తూనే ఉండటం వాళ్ళ తీవ్రమైన ఆర్ధిక ఒత్తిడికి, మనోవేదనకు గురై చివరకు టెంట్ హౌస్, పెట్రోల్ బంక్, ట్రావెల్స్, క్యాటరింగ్, స్టేషనరీ తదితర షాపుల యజమానుల నుండి తీవ్రమైన బెదిరింపులకు కూడా గురైన సందర్బాలు ఉన్నాయన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కంచెర్లపల్లి రమేష్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న చేబ్రోలు కృష్ణమూర్తి ఇటీవల జరిగిన డెప్యూటీ కలెక్టర్ల పదోన్నతులలో భాగముగా డెప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందుట ద్వారా ఖాళీ ఐన స్థానములో, కో-ఆప్షన్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత ఏలూరు జిల్లా అధ్యక్షుడు కంచెర్లపల్లి రమేష్ కుమార్ ను ఏకగ్రీవముగా ఎన్నుకున్నారు. ఏపిఆర్ఎస్ఏ సిటీ యూనిట్, రాష్ట్ర కార్యవర్గము నందు వివిధ పదవుల్లో విశేష సేవలను అందించి డిప్యుటీ కలెక్టరుగా పదోన్నతి పొందిన చేబ్రోలు కృష్ణమూర్తి ని గజమాలతో సత్కరించి వారి సేవలను అన్ని జిల్లాల నాయకులు కొనియాడారు. ప్రస్తుత కృష్ణా జిల్లా అధ్యక్షుడు తోట వెంకట సతీష్ డిప్యుటీ కలెక్టరుగా పదోన్నతి పొందిన సందర్భముగా వారిని కూడా సన్మానించారు.