సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే ఉపేక్షించేది లేదు*
130 మంది పోలీసులతో సోషల్ మీడియా సెంటర్ ఏర్పాటు
*టీమ్ లో సాప్ట్ వేర్ స్పెషలిస్టులు
ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక టీమ్
అమరావతి : రెచ్చగొట్టే ప్రకటనలు, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేసే వారికి సోషల్ మీడియా నిందితులు అందరూ
జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ సహాయంతో ఆంధ్రప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ, విజయవాడ లో ఒక సెంటర్ పెట్టడమే కాకుండా, ప్రతి జిల్లాలో హెడ్ క్వాటర్స్ లో ఒక CI, ఒక ఎస్ ఐ, 6 గురు కానిస్టేబుల్స్ తో ఆ జిల్లా ఎస్పి కి అనుసంధానం చేస్తూ, వారికి ల్యాప్టాప్ లు, డెస్క్ టాప్ లు ఇస్తూ డైరెక్ట్ గా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ట్విట్టర్ లోను, ఇంస్టాగ్రామ్ లోను, వాట్సాప్ గ్రూప్ లలో పెట్టే పోస్ట్ లను అబ్జర్వ్ చేస్తు ఉంటామని తెలిపారు.