ఓటమి భయం పట్టుకుంది * జగన్ ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడు * బటన్ నొక్కుడు
పేరుతో జగన్ బొక్కుడు సాగింది * రాష్ట్రంలో ఓట్ల దొంగలు…ప్రజలారా మీ ఓటు
జాగ్రత్త * కప్పం కట్టించుకోవడానికే పెద్దిరెడ్డి కుప్పం వస్తున్నాడు * కుప్పం
నియోజకవర్గం రామకుప్పం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
రామకుప్పం : గాడితప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే తన లక్ష్యమని
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.సంక్షేమ పథకాలకు బటన్ నొక్కుడు
కార్యక్రమం పేరుతో జగన్ బొక్కుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని
మండపడ్డారు. ప్రకటనలతో సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారని అరోపించారు.
రాష్ట్రంలో ఓట్ల దొంగలతో పాటు ప్రజల ఆస్తులు కొట్టేసే దొంగలు కూడా తయారయ్యారని
విమర్శించారు. జగన్ సినిమా అయిపోయిందని..ఓడిపోతున్నాడని ఆయనకు కూడా
అర్థమైందన్నారు. సామాజిక న్యాయం అంటున్నారని, రెడ్లలోనూ పెద్దిరెడ్డి, సజ్జల
రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తప్ప ఏ రెడ్డీ బాగుపడలేదన్నారు. ఈ
నలుగురు రెడ్లు బాగుపడితే రెడ్లంతా బాగుపడినట్లేనా అని ప్రశ్నించారు. జగన్
పాలనలో బలహీన వర్గాలు బాగుపడ్డాయా అని అన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత
ఉందో..జగన్ సామాజిక న్యాయంలో కూడా న్యాయం అంతే అని చురకలు అంటించారు.
మార్చాల్సింది మంత్రులు, ఎమ్మెల్యేలను కాదని..జగన్ ను మార్చాలని తెలిపారు.
రామకుప్పం బహిరంగ సభలో చంద్రబాబు శుక్రవారం ప్రసంగించారు. ‘‘నా జీవితంలో
ఎప్పుడూ చూడని అభిమానాన్ని నేడు రామకుప్పంలో చూశాను. 40 ఏళ్లుగా రామకుప్పం
వస్తున్నా…35 ఏళ్లులో ఎన్నోసార్లు సీఎంగా కూడా వచ్చాను కానీ ఇంతటి ఘనస్వాగతం
ఎప్పుడూ చూడలేదు. ప్రతి ఒక్కరి గుండెల్లో తెలుగుదేశంపార్టీ ఉంది…అది నా
అదృష్టం. చంద్రన్నా మీరే మమ్మల్ని కాపాడాలని ఆడబిడ్డలంతా బయటకు వచ్చారు.
పదేళ్ల వయసున్న చిన్నారులు కూడా హుషారుగా వస్తుండటంతో నా వయసు కూడా నేను
మర్చిపోయాను. వయసు నాకు నంబర్ మాత్రమే. మీ ఉత్సాహం చూశాక, మా ఆడబిడ్డల ఉత్సాహం
చూశాక..లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం ఉంది. మీరు గ్రామగ్రామానికి
వెళ్లి ఈ వంద రోజులు పని చేయండి.
కుప్పంలో 30 రకాల కూరగాయలు పండిస్తున్నారు..అన్ని రకాల కూరగాయలు పండుతాయని
ఎవరూ ఊహించలేదు. నేను 20 ఏళ్ల క్రితం హైటెక్ అగ్రికల్చర్ విధానం
తీసుకొచ్చాను…దాని ఫలితమే ఇప్పుడు ఇన్నిరకాల కూరగాయలు పండుతున్నాయి.
చెల్దిగానిపల్లెలో ఇజ్రాయిల్ టెక్నాలజీ తీసుకొచ్చి, మైగ్రో ఇరిగేషన్ ద్వారా
ఎస్సీలకు 100 శాతం రాయితీ ఇచ్చాను. మైక్రో ఇరిగిషన్ వల్ల పొదుపుగా నీటిని
వాడుకుని మూడు ఎకరాలకు సాగునీరందింవచ్చు. కుప్పంకు నీటి ఎద్దడి లేకుండా
చేయాలని చూశాను. హంద్రీనీవాను వి.కోట దాకా తీసుకొచ్చాను.. ఇన్ని రోజులు
పట్టించుకోకుండా ఇప్పుడు నేనొస్తున్నానని కాల్వలు కదిలిస్తున్నారు.
ఎన్నికలొస్తున్నాయని మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఉండుంటే
2020కే పూర్తై హంద్రీనీవాతో చెరువులను నీటితో నింపేవాళ్లం. నేను పులివెందులకు
నీళ్లిచ్చా…నువ్వు కుప్పంకు ఎందుకు నీళ్లవ్వవు.? పెద్దిరెడ్డికి
కాంట్రాక్టులు మీదున్న ప్రేమ రైతులపై ఉండదు. హంద్రీనీవా నీళ్లు కావాలి..అది
మన హక్కు. నీళ్లు పారించమంటే అవినీతి పారిస్తున్నారు ఈ దొంగలు. నాలెడ్జ్
ఎకనామీతో కుప్పం యువత మారాలని కలగన్నా..అందుకే మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ,
జూనియర్, యూనివర్సిటీ కూడా తీసుకొచ్చాను. రామకుప్పంలో పిల్లలు నా కోసం స్కూలు
నుండి బయటకు వస్తుంటే రాకుండా అడ్డుకున్నారు..వారిని అడ్డుకోవచ్చు కానీ వారి
మనసులను అడ్డుకోలేరు. టీచర్లకు కూడా జీతాలు సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఫీజు
రీయింబర్స్ మెంట్ కూడా సరిగా ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్
ఎగ్గొడుతున్నారు. ప్రకటనల పేరుతో ఇష్టారీతిన దోచుకుంటున్నారు. రాష్ట్రంలో
అందరికంటే ఎక్కువ బాధితులు పోలీసులే. అందరు రోడ్ల మీద ఉంటే జగన్ మాత్రం
ప్యాలెస్ లో ఉన్నాడు. జనాన్ని మోసం చేశాడు..జాబ్ కేలండర్ ఉందా.? పరిశ్రమలు
పెట్టాలంటే వచ్చేవారు లేరు..ఎవరన్నా రావాలన్నా వాటాలడగడంతో రావడం లేదు. అమర్
రాజా కంపెనీ కూడా వెళ్లిపోయింది. లులూ, అదానీ డేటా సెంటర్లు పోయాయి. రేపు
జరిగే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. పది వేలు ఇచ్చి లక్షలు
దోచేస్తే మీ జీవితాల్లో ఎలా వెలుగులు వస్తాయి.? ఇది మోసం కాదా.? అంగన్ వాడీలకు
తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పి..నేను ఎప్పుడు అన్నానని ఇప్పుడు
అంటున్నాడు.
వైసీపీ నేతలు కూడా ఈ ప్రభుత్వంలో బాధితులే. ఈ ప్రభుత్వాన్ని చూసి
మోసపోయాం..నష్టపోయాం..మేము కూడా రెడ్లమే, రెడ్లు బాగుపడలేదు అని శాంతిపురంలో ఓ
తల్లి చెప్పింది. సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది…ఆస్తులకు రక్షణ ఉండదని.
సర్వే చేసి మీకు చెప్పకుండా రికార్డులు రాసేశారు. కొత్త చట్టం ప్రకారం
ప్రైవేటు వ్యక్తుల దగ్గర సమాచారం పెట్టుకుంటాడు. ఒకరు పచ్చగా ఉంటే చూసి
ఓర్వలేని వ్యక్తి జగన్. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు..కుప్పంలో
ఇలాంటివి జరుగుతాయని అనుకోలేదు. ఒక్కొక్కరిపై పది కేసులు పెట్టారు..బానిసలుగా
చూసి ఆనందం పొందాలని చూస్తున్నారు. అన్యాయానికి గురైన కార్యకర్తలను కాపాడుకునే
బాధ్యత నాది. పోలీసులను కూడా కోరుతున్నా వచ్చేది కూడా టీడీపీనే..దౌర్జన్యాలు
చేసే వారు గుర్తుంచుకోండి సైకో చెప్పిన పనులు చేయొద్దు.
ప్రజల కోసం సూపర్ సిక్స్ తెచ్చాను. మహాశక్తి పథకం ద్వారా ప్రతి మహిళకు రూ.15
వందలు, తల్లికి వందనం ద్వారా రూ.15 వేలు, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు
ఉచితంగా ఇస్తాం. పేదరిక నిర్మూలన కోసం పేదలను పార్టనర్ గా చేర్చి పీపీపీపీ
విధానం అమలు చేస్తాం. ఒక మంత్రి ఉన్నాడు మాట్లాడితే కుప్పం వస్తాడు.. కప్పం
కోసం కుప్పంకు పెద్దిరెడ్డి వస్తున్నాడు. నువ్వు మంత్రా..దళారివా.? దళారివైతే
వ్యాపారం చేసుకో..మంత్రి వైతే సేవ చేయ్. నా మీద దాడి చేయిస్తే
భయపడతాననుకుంటున్నారా.? హంద్రీనీవా కాలువ ఇప్పుడు తవ్వుతున్నారు…కాసుల
కక్కుర్తితో తవ్వుతున్నారు. ఎవరి డబ్బులవి..ప్రజల డబ్బులు. ఆ ఇంట్లో ఒకరికి
మంత్రి, ఒకరికి ఎంపీ ఇచ్చాడు. నేను తలచుకుంటే వాళ్లు రోడ్లమీదకు కూడా
వచ్చేవారు కాదు. 175కు 175 మనమే గెలిచి వైసీపీని ఇంటికి పంపుదాం. జగన్
ప్రతిపక్షానికి కూడా పనికిరాడు. బానిసలుగా చూసే పరిస్థితి వచ్చింది.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పీఏ వాటాల్లో తేడా వచ్చి చనిపోయాడు. సాక్షి విలేకరి
ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో చెప్పండి. విశాఖలో మొన్న కుటుంబ మొత్తం ఆత్మహత్య
చేసుకుంది..రాష్ట్రంలో ఏం జరుగుతోంది.? ప్రభుత్వం ఉంది మనో నిబ్బరం
ఇవ్వడానికి..కానీ ఇదొక రాక్షస ప్రభుత్వం.’’ అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.