అనంతపురం : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్రకు అపూర్వ ఆదరణ
లభిస్తోంది. శుక్రవారం అనంతపురం నియోజకవర్గంలో చేపట్టిన సామాజిక సాధికార బస్సు
యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి
ఆధ్వర్యంలో బస్సు యాత్ర అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకూ
సాగింది. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ
సభకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని
నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరయ్యారు. పేర్ని నాని
మాట్లాడుతూ ‘ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలను మోసం చేసిన దుర్మార్గుడు
చంద్రబాబు నాయుడు.వెనుకబడిన వర్గాలకు చంద్రబాబు ప్రాధాన్యత లేదు. చంద్రబాబు
హయాంలో మైనారిటీ, ఎస్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించలేదు. ఓడిపోయిన
నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇచ్చారు. 17 మంది ఎస్సీ ఎస్టీ, బీసీ మైనారిటీలకు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఎవరెన్ని అడ్డంకులు
సృష్టించినా ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్‌దే. 40
ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సంక్షేమం ఎందుకు పట్టించుకోలేదు?, రుణమాఫీ
పేరుతో రైతులు డ్వాక్రా రుణాలను మోసం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. మీకు మంచి
జరిగుంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయండని విజ్ఞప్తి చేశారు. అనంతపురం ఎంపీ తలారి
రంగయ్య మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినవ అంబేద్కర్ వంటి వారు. ఎస్సీ
ఎస్టీ, బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మళ్ళీ వైఎస్ జగన్‌ను
ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి
మాట్లాడుతూ ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్నంతకాలం సంక్షేమ పథకాలు ఉంటాయి. అభివృద్ధి
విషయంలో వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే, సీఎం జగన్ రెండు అడుగులు
వేస్తున్నారని పేర్కొన్నారు.