విజయవాడ : నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్
మాండవియా శుక్రవారం పర్యటించారు. ఓల్డ్ జీజీహెచ్‌లో రూ.25 కోట్లతో
నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి
శంకుస్థాపన చేశారు. కొత్తగా 1.25 కోట్లతో నిర్మించిన ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్‌ను
కేంద్రమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఎంపీ
సత్యవతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్
కృష్ణబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని
ప్రశంసించారు. ఆరోగ్య రంగంలో ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు.
ఏపీ ప్రభుత్వం హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించడం
అభినందనీయమన్నారు. సీఎం జగన్‌కి, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి కేందమంత్రి
ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘‘ప్రజల ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా
ఉంటుంది. ప్రధాని మోదీ హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించారు.
దేశవ్యాప్తంగా 1.70 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించాం. గత
తొమ్మిదేళ్లలో 350 కి పైగా కొత్త మెడికల్ కళాశాలలనుప్రదాని మోదీ నిర్మించారు.
గ్రామీణ స్ధాయిలో హెల్త్ వెల్ నెస్ సెంటర్లని జిల్లా ఆసుపత్రులు, ఎయిమ్స్
లాంటి సంస్ధలతో అనుసంధానం చేశాం. గ్రామీణ ప్రాంతవాసులకు స్పెషలిస్ట్ సేవలు
టెలీ కన్సల్టేషన్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. ప్రతీ రోజూ 4 లక్షల వరకు టెలీ
కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు
ఉచితంగా చికిత్స అందిస్తున్నాం’’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.