విజయవాడ : కొండా రాజేశ్వరరావు మృతి వర్కింగ్ జర్నలిస్టు ఉద్యమానికి తీరని
లోటని పలువురు జర్నలిస్ట్ నేతలు పేర్కొన్నారు. ఐజేయు ,ఏపీయూడబ్ల్యూజే నేతలు
సంతాపం ప్రకటించారు. రాజేశ్వరరావు అకాల మృతికి ఐజేయు అధ్యక్షులు కే
శ్రీనివాసరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు ఐ వి సుబ్బారావు, చందు
జనార్ధన్, సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు,ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా
అసోసియేషన్ అధ్యక్షులు వై శివ, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు
విజయభాస్కర్, ఐజేయు,కౌన్సిల్ సభ్యులు కె .అజయ్ బాబు, కృష్ణారావు, విజయవాడ
యూనిట్ కార్యదర్శి సూర్య కిరణ్, కోశాధికారి బీవీ శ్రీనివాస్, రాష్ట్ర
కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, జి.రామారావు, సామ్నా విజయవాడ
అధ్యక్షులు సుబ్బారావు, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాజేశ్వరరావు
అంతిమయాత్ర శుక్రవారం ఉదయం 11 గంటలకు సయ్యద్ అప్పలస్వామి కాలేజీ వెనక ఉన్న
వారి స్వగృహం వద్ద నుండి బయలుదేరతుందని, అంత్యక్రియలు వాంబే కాలనీలోని స్మశాన
వాటికలో జరుగుతాయని వారి సోదరుడు తెలిపారు
రాజేశ్వరరావు భౌతికకాయానికి నివాళులు : రాజేశ్వరరావు భౌతికాయాన్ని సందర్శించి
నివాళులు అర్పించిన వారిలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచల జయరాజ్,
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి, ప్రెస్ క్లబ్ కార్యదర్శి
దాసరి నాగరాజు, ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, ఎం సాంబశివరావు, సామ్నా
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, యూనియన్ కార్యవర్గ సభ్యులు జి
రఘురాం, కుమార్, ప్రెస్ క్లబ్ కోశాధికారి హుస్సేన్, యూనియన్ నాయకులు భద్రం,
తదితరులు ఉన్నారు.