జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్సార్ ఆసరా
ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ వైయస్సార్ చేయూత
పెన్షన్ కోసం ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి
జిల్లాల కలెక్టర్లతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం
వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష
గుంటూరు, :విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జిల్లా
కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష
నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో
కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం
సమీక్ష జరిపారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై
కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు
ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడాకూడా పొరపాట్లు లేకుండా
చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్, లాంచ్,
పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయి. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు
షెడ్యూల్ చేసుకోవాలి. జనవరి నుంచి వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.3 వేలకు
పెంచుతాం. రూ.3 వేలకు పెన్షన్ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా
నెరవేరుస్తున్నామని సీఎం చెప్పారు.
జనవరి 19న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ : జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ
పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుందన్నారు. 2019లో మన ప్రభుత్వం రాకముందు
ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారని, మనం
అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 లు చేశామని, ఆ తర్వాత ఇప్పుడు రూ.3 వేల
వరకూ పెంచుకుంటూ వచ్చామన్నారు. గత ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్ల మాత్రమే
సగటున పెన్షన్లకోసం ఖర్చు చేసేవారని, మన ప్రభుత్వ హయాంలో నెలకు సుమారు
రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు
పెన్షన్ల సంఖ్య 39 లక్షలైతే ఇవాళ పెన్షన్ల సంఖ్య దాదాపు 66 లక్షలు అన్నారు.
ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదని, ప్రతి ఒక్కరికీ కూడా మంచి
జరగాలని, ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని, ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్,
సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చామన్నారు. ఒకటో తారీఖు అది
ఆదివారమైనా, పండుగైనా సరే పొద్దునే వాలంటీర్ చిక్కటి చిరునవ్వుతో పెన్షన్‌ను
ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకు రాగలిగామన్నారు. ఈ నాలుగున్నర
సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగామని చెప్పారు.
రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. మూడో
కార్యక్రమం వైఎస్సార్ ఆసరాలో భాగంగా జనవరి 23 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం
జరుగుతుంది. నాలుగోది వైయస్సార్ చేయూత కార్యక్రమం. ఇది ఫిబ్రవరి 5 నుంచి
14వరకూ కొనసాగుతుంది. ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా
ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా
మిగిలిపోయిన సందర్భాల్లో మరలా రీవెరిఫికేషన్ చేసి, వారికి పథకాలు వర్తింపు
చేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం
జరిగే లోపే వెరిఫికేషన్ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల పెన్షన్లు ఒకటో
తారీఖు నుంచే ఇస్తారని, 66,34,742మందికి సుమారు రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల
రూపంలో అందుతాయన్నారు. మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందని,
క్రెడిబులిటీకి అర్ధం చెబుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ సందేశం ప్రతి
ఒక్కరికీ చేరాలని, పెన్షన్ల పెంపు కార్యక్రమం జనవరి 1వ తేదీనే
ప్రారంభమవుతుందన్నారు. ఇందులో భాగంగా జనవరి 3న కాకినాడలో ఈ కార్యక్రమంలో
పాల్గొంటున్నానని చెప్పారు. అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ
తారీఖునే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని, ప్రజా ప్రతినిధులంతా పెన్షన్
కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు ప్రతి
మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, 8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో
పెన్షన్ కానుక కార్యక్రమం జరుగుతుందన్నారు. ఏయే మండలాల్లో ఏయే రోజుల్లో
జరుగుతుందన్న దానిపై షెడ్యూలు చేసుకోవాలని, పెన్షన్‌తోపాటు నా తరపున లేఖను
కూడా లబ్ధిదారులకు అందించాలన్నారు. అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా
లబ్ధిదారులకు చేరవేయాలని కోరారు.
పెన్షన్ కోసం ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు : ప్రజా ప్రతినిధులు,
వాలంటీర్లు, ఉత్సాహవంతులు, లైక్ మైండ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని
కోరారు. ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలని, రాష్ట్ర చరిత్రలో
ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదని, వారి
ఆత్మగౌరవాన్ని కాపాడుతూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే పెన్షన్
అందిస్తున్నామన్నారు. మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం
కృతనిశ్చయంతో అడుగులు వేసిందని, ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా
కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో అందరికీ తెలిసిందే అన్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలని, ఈ పెన్షన్
కార్యక్రమం కోసం ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలబడేందుకు
సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి
(ఎక్సైజ్‌శాఖ) కె నారాయణస్వామి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్
అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి,
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, సాంఘిక
సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, సెర్ఫ్ సీఈఓ ఏ.ఎండి. ఇంతియాజ్,
మెప్మా మిషన్ డైరెక్టర్ వి విజయలక్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.