విజయవాడ : ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ మాజీ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు
గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా గుండె కు
సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన విజయవాడ యూనిట్ యూనియన్ కార్యదర్శిగా
2018 నుండి 23 వరకు పనిచేశారు. యూనియన్ కార్యకలాపాలలో ఆయన చురుగ్గా
పాల్గొనేవారు. ఆయన రచయితగా కొన్ని కవితలు కూడా రాశారు. హెల్పింగ్ హాండ్స్
సంస్థలో కొంతకాలం సేవలు అందించారు. ఈనాడు దినపత్రికతో ఆయన జర్నలిస్టు
ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం సాక్షితో సహా వివిధ దినపత్రికల్లో పనిచేశారు.
ఆయన మంచి ఆర్టిస్ట్ కూడా. గతంలో ఆయన కొంతకాలం న్యాయవాద వృత్తిని కూడా
చేపట్టారు. కొండా రాజేశ్వరరావు మృతి వర్కింగ్ జర్నలిస్టు ఉద్యమానికి తీరని
లోటు. ఆయన మృతికి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర , విజయవాడ యూనిట్లు, ప్రెస్ క్లబ్
కార్యవర్గాలు, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు, యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు,
సామ్నా, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్లు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించాయి.
వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపాయి.