అమరావతి : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్సార్సీపీ లో చేరారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో గురువారం ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
సీఎం క్యాంప్ కార్యాలయంలో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ
స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. కాగా అంబటి రాయుడు
వైఎస్సార్సీపీలో చేరడం చాలా కాలం క్రితమే ఖరారైంది. గతంలోనూ పలుమార్లు సీఎం
జగన్తో మంతనాలు జరిపారు. ఆయన పోటీ చేయబోతున్నారంటూ పలు నియోజకవర్గాల పేర్లు
కూడా చక్కెర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా పలు నియోజకవర్గాల్లో
వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు ప్రక్రియను
కొనసాగిస్తున్నారు. సీఎంవో నుంచి పిలుపు రావడంతో పలువురు మంత్రులు,
ప్రజాప్రతినిధులు గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఇలా
వెళ్లినవారిలో అంబటి రాయుడు కూడా ఉండడం గమనార్హం. అయితే అంబటి రాయుడు ఎక్కడి
నుంచి పోటీ చేయబోతున్నారు? అసెంబ్లీ బరిలోనా? పార్లమెంట్ ఎన్నికల్లోనా? అనేది
ఇంకా తేలలేదు.