ఇండియా స్కిల్స్ రిపోర్ట్-2024 నివేదికలో వెల్లడి
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యువతకు ఉపాధి వైపు నడిపించడంలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాజ్యసభ సభ్యులు,
వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా
వేదికగా బుధవారం పలు అంశాలపై స్పందించారు. ఫ్యూచర్ స్కిల్స్ అందించడంతో
రాష్ట్రంలో దేశంలోనే అగ్రభాగాన నిలిచిందని ఈ మేరకు ఇండియా స్కిల్స్
రిపోర్టు-2024 స్పష్టం చేసిందని అన్నారు. అలాగే ఇంటర్న్ షిప్ పై ఆసక్తి
కనబరుస్తున్న విద్యార్దుల్లోనూ ఏపీ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు.
విద్యలో దృఢ సంకల్పం, నైపుణ్యాల పెంపుతోనే ఈ ఘనత సాధ్యమయ్యిందని అన్నారు.
విద్యార్దులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలన్న
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం సాకారం అవుతోందని అన్నారు. దేశంలోనే
అత్యధిక న్యుమరికల్ స్కిల్స్ కనబరుస్తున్న విద్యార్థుల్లో గుంటూరు, విజయవాడ
నగరాలకు చోటు దక్కిందని అన్నారు.
ఏపీలో అమృత్ భారత్ ట్రైన్లు నడపాలి : ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర ప్రాంతాలకు
అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం
ఆంధ్రప్రదేశ్ లో అమృత్ భాతత్ ట్రైన్లు నడపాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి
అశ్విన్ వైష్ణవ్ ను విజయసాయిరెడ్డి కోరారు. ప్రస్తుతం ఈ ట్రైన్లలో సెకండ్
క్లాస్ కోచ్ లు/ స్లీపర్ల సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రయాణీకుల ఇబ్బందులకు
గురవుతున్నారని ఈ మేరకు రైల్వే మంత్రి దృష్టి సారించాలని విజయసాయి రెడ్డి
కోరారు.