రవీంద్ర రాజు
మంగళగిరి : విఆర్ఓ గ్రేడ్-2 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్
గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర రాజు
కోరారు. బుధవారం విజయవాడ మంగళగిరి లో ఉన్న సిసిఎల్ఏ కార్యాలయంలో సీసీఎల్ఏ అండ్
స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్ , అడిషనల్ జాయింట్ సెక్రెటరీ
ఇంతియాజ్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నేతలు
కలిశారు. ఈ మధ్యకాలంలో సర్వే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో సుమారు 650
మంది పాస్ అయ్యారని, ఇంకా సర్వే ఎగ్జామ్స్ పాస్ కానీ వారు, సర్వే ట్రైనింగ్
కి, వివిధ కారణాలతో హాజరు కాని వారిని, అలాగే సి. పి. టి పరీక్ష పాస్ కానీ
వారికి, ప్రస్తుతం ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పట్లో సర్వే
సప్లిమెంటరీ ఎగ్జామ్, సిపిటి ఎగ్జామ్, నిర్వహించడానికి అవకాశం లేనందున,
మిగిలిన గ్రేడ్ 2విఆర్ఓ లందరికీ, ముందుగా ప్రొబిషన్ డిక్లేర్ చేసేలాగా తగు
ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 13 జీవో ప్రకారం సి పి టి, సర్వే పరీక్ష
తప్పనిసరిగా పాస్ కావాలని నిబంధనలు ఉన్నందున ఈ రెండు పాస్ కావడానికి ఒక
సంవత్సరం గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకు వారు సానుకూలంగా
స్పందిస్తూ అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామని సిసిఎల్ఏ స్పెషల్
చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, అడిషనల్ జాయింట్ సెక్రెటరీ ఇంతియాజ్
తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మీనారాయణ ,
కృష్ణాజిల్లా ప్రచార కార్యదర్శి నళిని కుమార్ , శ్రీనివాస్ తదితరులు
పాల్గొన్నారు.