క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టే వేదిక ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు
తణుకు : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ఉజ్వల భవిత కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్రెడ్డి‘ఆడుదాం ఆంధ్రా’ మహా క్రీడాయజ్ఞాన్ని తలపెట్టారని
రాష్ట్ర పౌర సరఫరాల, వినియోగదారులు శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు
తెలిపారు. మంగళవారం తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ కళాశాల నుంచి మున్సిపల్
కార్యాలయం వరకు మారథాన్ 2కె రన్ మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా
క్రీడాకారులతో మంత్రి ప్రమాణం చేయించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం
అంతా‘ఆడుదాం ఆంధ్రా’ తో క్రీడోత్సాహం ఉప్పొంగనుందన్నారు. సీఎం ఇంతటి మహా
క్రీడాయజ్ఞాన్ని తలపెట్టాడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. నేటి నుంచి
మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు రాష్ట్ర క్రీడా చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా
నిలుస్తుందన్నారు. మన పిల్లలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడించేందుకు మన
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని
అన్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీ వరకు (47) రోజుల పాటు ఊరూరా పండుగ
వాతావరణంలో జరుగుతుందన్నారు. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగగా చరిత్రలో
నిలిచిపోతుందని చెప్పారు. ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం వెనుక మన ప్రభుత్వానికి
రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయని తెలిపారు. గ్రామస్థాయిలోని ఆణిముత్యాలను
వెలికితీసి వారిని ప్రపంచానికి పరిచయం చేయడం ఒకటైతే, వ్యాయామం, క్రీడల వల్ల
అనారోగ్య సమస్యలు దూరమైపోతాయనేది రెండో ఉద్దేశమని తెలిపారు. ఈ రెండు ప్రధానమైన
ఉద్దేశాలను అచీవ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి
చేస్తున్నారని ఆయన వివరించారు. గ్రామస్థాయి నుంచి మొదలై మండల, నియోజకవర్గ,
జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి అని మంత్రి కారుమూరి వివరించారు. ఈ
కార్యక్రమానికి ఎమ్మెల్సీ వంక రవీంద్ర, తణుకు నియోజకవర్గం వైఎస్సార్సీపీ
నాయకులు పాల్గొన్నారు.
ఏపీలో ఓటీపీ దొంగలు పడ్డారు జాగ్రత్త : రాష్ట్రంలో ఓటీపీ దొంగలు
తిరుగుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల
శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం తణుకు
వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
మంత్రి మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అడిగే హక్కు అన్ని పార్టీలకు
ఉంటుందని, రాష్ట్రంలో మాత్రం టిడిపి పార్టీ ఓటుకు బదులుగా ఓటీపీ
అడుగుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మన ఓటీపీ చెప్పడం వల్ల మన
విలువైన వివరాలు తెలుసుకుని, మన ఓట్లు గల్లంతుకాకుండా, అకౌంట్లోకి చొరబడి మన
డేటాను కూడా చోరీ చేస్తారన్నారు. ఓట్లు ముసుగులో ఓటిపిలు అడగడం ఇది
దొంగతనానికి నిదర్శనమని మంత్రి విమర్శించారు. ఇది ముమ్మాటికి సైబర్ క్రైమ్
నేరం కింద వస్తుందన్నారు. ఓటిపిల ద్వారా సమాచారాన్ని దొంగిలిస్తే కఠినంగా
శిక్షిస్తామన్నారు. మీ ఇళ్లకు వచ్చి ఓటిపిలు అడిగితే పోలీసులకు ఫిర్యాదు
చేయాలని మంత్రి తెలిపారు. ప్రజా క్షేత్రంలో గెలవలేక ఇటువంటి నీచమైన పనులకు
టిడిపి దిగజారిందన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల మనస్సును గెలుచుకొని
విజయేడు అయ్యాడు అని మంత్రి తెలిపారు.
వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేతలు : తణుకు పట్టణ టీడీపీ తెలుగు యువత మాజీ
ఉపాధ్యక్షుడు, ఏలూరు జిల్లా ప్రైవేట్ ఐటీఐ కళాశాలల అసోసియేషన్ సహాయక
కార్యదర్శి యడ్లపల్లి సురేంద్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో
వైఎస్సార్సీపీలోకి చేరారు. మంగళవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిసిన
సురేంద్రకు మంత్రి కారుమూరు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సురేంద్ర
టిడిపి సీనియర్ నాయకులు, ఏఎంసీ మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ అల్లుడు కావడం
విశేషం. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ టీడీపీ అనుసరిస్తున్న
విధానాలపై టీడీపీ వర్గీయులు విసిగెత్తితుండడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ముగ్ధులై వైఎస్సార్సీపీలో చేరుతున్నారని అన్నారు.
సురేంద్ర తో పాటు తేతలి గ్రామానికి చెందిన యువకుడు దొమ్మేటి శివ కూడా పార్టీలో
చేరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు వెంకట సుబ్బారావు, తణుకు
పట్టణ అధ్యక్షులు మంగెన సూర్య, అత్తిలి మండల అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ,
తణుకు మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, తణుకు వైసీపీ నాయకులు రామిశెట్టి
రాము పాల్గొన్నారు.