అమరావతి : నమ్ముకున్న వాళ్ళను వంచించడం సీఎం జగన్ నైజమని, కేవీపీ, మోపిదేవి,
సూర్యుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది జగన్ బాధితులేనని టీడీపీ సీనియర్ నేత,
మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో
మాట్లాడుతూ సీఎం జగన్‌ను నమ్ముకుని టీడీపీ నేతలపై కేసులు వేసిన ఆర్కే
పరిస్థితి ఏమైందో తెలుసుకోవాలన్నారు. పీకేకు కూడా జగన్‌పై నమ్మకం లేక తమకు
సలహాలు ఇస్తున్నారన్నారు. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు దగ్గర
కావాల్సిన అవసరం తమకు లేదని, ఆమెను దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా చేయమని
స్పష్టం చేశారు. రక్తం పంచుకు పుట్టిన చెల్లెలే తమ మేలు కోరుతున్నారంటే
పరిస్థితి అర్థం చేసుకోవాలని నక్కా ఆనందబాబు అన్నారు. సొంత చెల్లెలు, తల్లికి
ద్రోహం చేసిన వ్యక్తి అని, జగన్ వదిలిన బాణం చివరికి ఆయనకే గుచ్చుకో
బోతుందన్నారు. దేశానికి సరిహద్దులు వుంటాయి కానీ, జగన్ అవినీతికి సరిహద్దులు
లేవన్నారు. జగన్ పరిపాలన చూసి పులివెందుల ప్రజలు కూడా భయపడుతున్నారన్నారు.
నకిలీ మద్యం పేరుతో మహిళల పుస్తెలు తెంచిన వ్యక్తి అని, నమ్మిన ప్రతి ఒక్కరినీ
మోసం చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం గెలుపు ఖాయం కనుకనే
ప్రశాంత్ కిషోర్ తమ దగ్గరకు వచ్చారని, జగన్ అవినీతికి గతంలో ఐఏఎస్ అధికారులు
మాత్రమే జైల్‌కు వెళ్లారని జగన్ అక్రమాలకు ఈసారి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా
జైల్‌కు వెళ్ళబోతున్నరని నక్కా ఆనందబాబు అన్నారు. విశ్వాసనీయత గురించి
మాట్లాడే జగన్‌కు దానికి అర్థం కూడా తెలియదన్నారు. జగన్ సమావేశాలంటేనే జనం
బెంబేలెత్తుతూ, ఛీత్కరించుకుంటున్నారని, రిలయన్స్ వారే వైఎస్ఆర్ మృతికి
కారకులని వారి సంస్థలపై దాడులు చేయించారని ఆరోపించారు. ఎత్తుకొని పెంచిన
చిన్నాన్న పట్ల జగన్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందేనన్నారు. శంఖుస్థాపన చేసిన
కడప స్టీల్ ఫ్యాక్టరీ పునాది రాయికే పరిమితమైందని నక్కా ఆనందబాబు ఎద్దేవా
చేశారు.