అమరావతి : నిశ్శబ్ద విప్లవం బహిరంగ విప్లవమవుతోందని టీడీపీ మాజీ మంత్రి యనమల
రామకృష్ణుడు అన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా నిశ్శబ్దంగా ఉన్నారని భావించారని,
జగన్ రెడ్డి దోపిడీ, మితిమీరిన అహంకారంతో ప్రజల తిరుగుబాటు
బహిరంగమవుతోందన్నారు. తొలుత జగన్ రెడ్డి చేతకాని పాలనపై సొంత ఎంపీ
రఘురామకృష్ణమ రాజు బయటపెట్టారని, తర్వాత ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారని
యనమల విమర్శించారు. పంచాయతీల్లోని సమస్యలపై ఎంపీటీసీలు, సర్పంచులు గళం విప్పి
నిలదీశారని, అభ్యర్ధుల మార్పు నిర్ణయాలతో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం
ధిక్కార స్వరం వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు నాలుగున్నరేళ్లుగా
ప్రభుత్వ అరాచకాలు, ధరల బాడుడు, పన్నుల మోత, ఇసుక, మద్యం వంటి అంశాలపై
నిశ్శబ్దంగా ఉన్న సామాన్యులు గేరు మార్చి స్వరం విప్పుతున్నారని తెలిపారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసినందుకు అంగన్వాడీ ఉద్యోగులు, ఆశ
వర్కర్లు, వాలంటీర్లు, మున్సిపల్ ఉద్యోగులు రోడ్డెక్కి సమరశంఖం పూరించారని
యనమల పేర్కొన్నారు.