ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్ కు చెక్ పెడుతూ
స్ట్రాటెజీస్ కు క్లాప్ కొట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఏపీ కాంగ్రెస్
ఇన్ఛార్జ్ గా మాణిక్యం ఠాకూర్ కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, తెలంగాణలో
పవర్ చేజిక్కింది. అంతే వైట్ నాట్ ఏపీ? అంటూ రాహుల్ గాంధీ బెల్ మోగించారు.
తెలంగాణ ఎన్నికల టైమ్ నుంచే ఆయన ఇప్పుడు ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు
తెలుస్తోంది. రాహుల్ మాట రీసౌండ్ ఇవ్వడమే కాకుండా ఏపీ కాంగ్రెస్లో కదలిక
కన్పించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు, బెజవాడలో పొలిటికల్
ఎఫైర్స్ మీటింగ్, ఇలా చాన్నాళ్ల తరువాత ఢిల్లీతో ఫోన్-ఇన్ల పర్వం మొదలైంది.
తను అనుకున్నది అనుకున్నట్లు జరగాలని, జరుగుతుందని నమ్మే కొద్దిమందిలో జగన్
ఒకరు. ఆయన 70 మంది అభ్యర్థులను మార్చడమో తీసేయడమో చేస్తున్నారు. అయితేజగన్
కొత్తవారిని పెట్టి గెలిపిద్దాం అనుకుంటుంటే రేవంత్ రెడ్డి జగన్ కి భారీ
షాకిచ్చారు. ఏపీలో ఏ పార్టీ ఎమ్మెల్యేకి అయినా తెలంగాణలో ఆస్తులు, వ్యాపారాలు
ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ మార్చిన ఎమ్మెల్యేలతో రేవంత్ దూత
ఒకరు వివరాలు సేకరిస్తున్నారు. వారిని హైదరాబాదులో మీ వ్యాపారాలకు సహకరిస్తాం.
కాంగ్రెస్ లో చేరండి. ఎలాగో 2024 మోడీకి సీట్లు తగ్గుతాయి. 2029లో అయితే
కచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మీరు కాంగ్రెస్ లో చేరితో
మంచి భవిష్యత్తు ఉంటుందని చెబుతున్నారట. ఎందుకంటే జగన్ ఇంతమంది మార్చడానికి
పెద్ద కారణం వారిపై వ్యతిరేకతే కాదు, వారిని మార్చినా వారు ఎక్కడికీ పోలేరన్న
నమ్మకం. అయితే ఎవరూ ఊహించి విధంగా సీన్లోకి రేవంత్ రెడ్డి ఎంటరయ్యాడు.
వాస్తవానికి జగన్ వదిలేసిన ఎమ్మెల్యేలకు ఇది బంపారఫరనే చెప్పాలి. ఎందుకంటే
దీర్ఘకాలంగా చూసుకుంటే రేవంత్ సరసన చేరడమే వారికి ఎక్కువ ఉపయోగం. కాబట్టి
చాలామంది రేవంత్ దూతకు ఆల్మోస్ట్ సమ్మతం తెలుపుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ
సీటు రానపుడు మీరు ఆ పార్టీలో ఉన్నా ఉపయోగం లేదు. ఈ ఐదేళ్లు మీ వ్యాపారాలు
బాగుంటాయి, ఒక వేళ మీకు బలం ఉంటే ఈ ఎన్నికల్లో గెలుస్తారు. పార్టీ మీద ఇపుడు
జనంలో నెగెటివిటీ లేదు, కాబట్టి కాంగ్రెస్ లో చేరండి అని రేవంత్ దూత బ్రెయిన్
వాష్ చేస్తున్నారట. వైసీపీ నుంచి సుమారు 40 మందికి పైగా నేతలు కాంగ్రెస్ లో
చేర్చుకోవాలని రేవంత్ ప్రయత్నం. తద్వారా కాంగ్రెస్ పార్టీలో మరింత పట్టు
సాధించి తెలుగు రాష్ట్రాల్లో పార్టీని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీలో
తిరుగులేని నేతగా ఎదగాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి జగన్
అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. రేవంత్ ప్లాన్ సక్సెస్ అయితే వైసీపీ ఓటు
భారీగా చీలే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే జనంలో తీవ్ర
వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో రేవంత్ ఎంటరవడంతో వైసీపీ కుదేలవడం ఖాయం.ఎమ్మెల్యేలు
కూడా రేవంత్ దూత మాట విని కాంగ్రెస్ లో చేరితో రేపటి రోజున తెలుగుదేశం
అధికారంలోకి వచ్చినా తమకు ఏ ప్రమాదం ఉండదని భావిస్తున్నారట.