ప్రపంచ శాంతి సదస్సుకు రావాలని ఆహ్వానం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్
చిరంజీవి సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
సీఎం రేవంత్‌ను కలిసిన కేఏ పాల్ : సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
జనవరి 30న హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు హాజరుకావాలని
ముఖ్యమంత్రిని ఆయన కోరారు. అలాగే సదస్సు నిర్వహణకు కావాల్సిన అనుమతులు మంజూరు
చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని కేఏ
పాల్ తెలిపారు. సదస్సుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర
మంత్రులను సైతం ఆహ్వానించినట్లు వివరించారు. పలు దేశాల నుంచి వేల మంది
ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు