కడప : జగన్‌ను గెలిపించి మనం తప్పు చేశామని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే
మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. కడపలో నిర్వహించిన మాజీ మంత్రి వీరారెడ్డి
వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేను నాలుగు సార్లు
ఎమ్మెల్యేగా గెలిచా. అయినా నా గ్రాఫ్ బాగా లేదంటూ సీఎం జగన్ నన్ను
కించపరిచారు. ఉదయగిరిలో నేను డబ్బు తీసుకుంటున్నానని జగన్ అన్నారు. ఉదయగిరిలో
ఏముందని సంపాదించడానికి? పార్టీ బలోపేతం కోసం ఎంతో శ్రమించా. లేనిపోని
అనుమానాలతో నా టికెట్నే అమ్మకానికి పెట్టారు. అనాలోచిత నిర్ణయాలతో
రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు. రాష్ట్రంలో ఎటుచూసినా అభివృద్ధి అనేదే
లేదు. జగన్ చుట్టూ ఉండేవారు, సలహాదారులు ఎవరికివారు దోచుకునేవాళ్లే. బటన్లు
నొక్కడమే పనిగా పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఎలా?. నాయకుడికి
తీవ్రమైన ధనదాహం ఉండకూడదు. రుషికొండలో భవనాలను సరదాగా కట్టుకున్నట్లు ఉంది.
వైఎస్‌కు ఉన్న గుణాలేవీ జగన్‌కు రాలేదు. ఏపీలో అక్రమ కేసులు, అన్యాయాలను ఇక
భరించలేం. జగన్ ఇక జన్మలో ముఖ్యమంత్రి కాలేరు. జగన్ లాంటి వారు రాష్ట్రాన్ని
పాలిస్తే ప్రజలు బాగుపడరు. సీఎం పదవి భగవంతుడు ఇచ్చిన వరమని జగన్ గ్రహించాలి.
ఈసారి టీడీపీ ప్రభుత్వం రాకుంటే మనం గుండు కొట్టుకోవాల్సిందే. టీడీపీకి అన్ని
జిల్లాల్లో మంచి స్పందన వస్తోందన్నారు.