మంగళగిరి: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్షసాధింపులు
మొదలయ్యాయని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.
మంగళగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు
పెట్టాలని ఎవరైనా రాష్ట్రానికి వస్తే వైసీపీ నేతలు వాటాలు అడుగుతున్నారని
ఆరోపించారు. పరిశ్రమల సంపదలో వాటా కోసం జగన్ ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ
ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి
చెయ్యడం మానేసి విశాఖ రాజధాని అంటారా దొరికిన ప్యాలస్‌లు ఆక్రమించుకోవడం,
భూకబ్జాలు తప్ప విశాఖకు ఏం చేశారు. ప్రైవేటు ఆస్తులను, సామాన్య ప్రజల భూములను
ఆక్రమించుకున్నారు. దీంతో అక్కడ అశాంతి ఏర్పడింది. గందరగోళంతో ప్రజలు
భయభ్రాంతులకు గురవుతున్నారని కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.